Breaking News

దివ్య దేశ్‌ముఖ్‌కు వైల్డ్‌ కార్డు 

Published on Tue, 09/23/2025 - 05:00

న్యూఢిల్లీ: భారత మహిళా గ్రాండ్‌మాస్టర్, మహిళల చెస్‌ ప్రపంచకప్‌ చాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్‌ ఈ ఏడాది మరోసారి పురుషుల ఈవెంట్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఇటీవలే గ్రాండ్‌ స్విస్‌ టోర్నీలో పురుష గ్రాండ్‌మాస్టర్లతో పోటీపడ్డ దివ్య... అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 27 వరకు భారత్‌లోని గోవా వేదికగా జరిగే పురుషుల ప్రపంచకప్‌ 
టోర్నీలో బరిలోకి దిగనుంది. 

వాస్తవానికి దివ్యకు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం లేకపోయినా... చివరి నిమిషంలో ఒక ప్లేయర్‌ వైదొలగడంతో ఆ స్థానాన్ని దివ్య దేశ్‌ముఖ్‌తో భర్తీ చేశారు. ఈ టోర్నీలో ఆడాలని మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ హు ఇఫాన్‌ (చైనా), ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జు వెన్‌జున్‌ (చైనా)లకు నిర్వాహకులు ఆహ్వానించారు. అయితే ఈ ఇద్దరు చైనా గ్రాండ్‌మాస్టర్లు ప్రపంచకప్‌లో ఆడేందుకు రాలేమని తెలిపారు. నాకౌట్‌ ఫార్మాట్‌లో జరిగే ప్రపంచకప్‌లో మొత్తం 206 మంది ప్లేయర్లు పోటీపడతారు.

 టాప్‌–3లో నిలిచిన వారు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధిస్తారు. భారత్‌ నుంచి ఈ టోర్నీలో 20 మంది ప్లేయర్లు  ఆడనున్నారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్, అరవింద్‌ చిదంబరం, పెంటేల హరికృష్ణ, నిహాల్‌ సరీన్, మురళీ కార్తికేయన్, ప్రాణేశ్, ఇనియన్, ఎస్‌ఎల్‌ నారాయణన్, దీప్తాయన్‌ ఘోష్, సూర్యశేఖర గంగూలీ, కార్తీక్‌ వెంకటరామన్, రాజా రితి్వక్, ఆరోన్‌యక్‌ ఘోష్, లలిత్‌ బాబు, హిమల్‌ గుసెయిన్, హర్షవర్ధన్, నీలాశ్‌ సాహా పోటీపడనున్నారు.   
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)