Breaking News

భారత్‌ చేజారిన కాంస్యం

Published on Fri, 05/09/2025 - 03:39

షాంఘై: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోర్నమెంట్‌లో భారత రికర్వ్‌ పురుషుల, మహిళల జట్లు పతకం సాధించడంలో విఫలమయ్యాయి. ధీరజ్‌ బొమ్మదేవర (ఆంధ్రప్రదేశ్‌), అతాను దాస్‌ (బెంగాల్‌), తరుణ్‌దీప్‌ రాయ్‌ (సిక్కిం)లతో కూడిన భారత పురుషుల జట్టు త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకోగా... దీపిక కుమారి (జార్ఖండ్‌), అంకిత (బెంగాల్‌), అన్షిక కుమారి (బిహార్‌)లతో కూడిన భారత మహిళల జట్టు మాత్రం రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది. కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్లు మధుర (మహారాష్ట్ర), రిషభ్‌ యాదవ్‌ (హరియాణా) సెమీఫైనల్‌ చేరుకొని పతకాల వేటలో నిలిచారు.  

క్రిస్టియన్‌ స్టాడర్డ్, బ్రాడీ ఎలీసన్, జాక్‌ విలియమ్స్‌లతో కూడిన అమెరికా జట్టుతో కాంస్య పతక మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–5 సెట్‌ పాయింట్లతో ఓడిపోయింది. తొలి సెట్‌ను అమెరికా 57–56తో నెగ్గి 2 పాయింట్లు సాధించింది. రెండో సెట్‌ 56–52తో అమెరికా ఖాతాలోనే వెళ్లింది. అమెరికా ఆధిక్యం 4–0కు పెరిగింది. మూడో సెట్‌ను భారత్‌ 55–54తో గెలిచి 2  పాయింట్లు సంపాదించింది. నాలుగో సెట్‌లో రెండు జట్లు 56–56తో సమంగా నిలిచాయి. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ దక్కింది. ఓవరాల్‌గా అమెరికా 5–3తో విజయాన్ని ఖరారు చేసుకొని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 

అంతకుముందు భారత జట్టు 5–4తో (53–51, 55–58, 55–56, 54–53, 29–27) కజకిస్తాన్‌పై గెలిచింది. నాలుగు సెట్‌ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. దాంతో ‘షూట్‌ ఆఫ్‌’ నిర్వహించగా... భారత్‌ పైచేయి సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 6–0తో (58–56, 57–56, 55–53)తో ఇటలీపై నెగ్గింది. సెమీఫైనల్లో టీమిండియా 4–5తో (51–54, 50–56, 56–55, 55–53, 25–26) ‘షూట్‌ ఆఫ్‌’లో ఫ్రాన్స్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. 

తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆడిన భారత మహిళల జట్టు 4–5తో (49–50, 52–54, 52–45, 55–48, 26–27)తో ‘షూట్‌ ఆఫ్‌’లో అలెజాంద్రా వలెన్సియా, వాలెంటీనా వాజ్‌క్వెజ్, మోంటాయ అల్ఫారోలతో కూడిన మెక్సికో జట్టు చేతిలో ఓడిపోయింది.  

చికిత, జ్యోతి సురేఖలకు నిరాశ 
మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ క్రీడాకారిణి తనిపర్తి చికిత, ప్రపంచ చాంపియన్‌ అదితి స్వామి నిరాశపరచగా... మధుర సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్లో మధుర 142–141తో జ్యోతి సురేఖను ఓడించింది. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో చికిత 134–138తో అదెల్‌ జెక్సెన్‌బినోవా (కజకిస్తాన్‌) చేతిలో, అదితి 129–140తో కార్సన్‌ క్రాహి (అమెరికా) చేతిలో ఓడిపోయారు.

పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత క్వార్టర్‌ ఫైనల్లో రిషభ్‌ డెన్మార్క్‌కు చెందిన మథియాస్‌ ఫులర్టన్‌పై గెలిచాడు. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 147–147తో సమంగా నిలిచారు. ‘షూట్‌ ఆఫ్‌’లోనూ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే రిషభ్‌ సంధించిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో అతనికి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది. 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు