Breaking News

చాలా బాధగా ఉంది.. కానీ కొన్నిసార్లు తప్పదు: జస్ప్రీత్‌ బుమ్రా

Published on Sun, 01/05/2025 - 11:53

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ను టీమిండియా ఘోర ప‌రాజ‌యంతో ముగించింది. సిడ్నీ వేదిక‌గా ఆసీస్‌తో జ‌రిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భార‌త్ ఓట‌మి చ‌విచూసింది.  దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయింది.162 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త జ‌ట్టు డిఫెండ్ చేసుకోలేక‌పోయింది.

మూడో రోజు ఆట‌కు స్టాండింగ్ కెప్టెన్‌, స్టార్ పేస‌ర్‌ జ‌స్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు. దీంతో భార‌త బౌలింగ్ యూనిట్ తేలిపోయింది. ఈ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఆసీస్ కేవ‌లం 27 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక ఈ ఓట‌మిపై టీమిండియా తత్కాలిక కెప్టెన్ జ‌స్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికి త‌మ జ‌ట్టు అద్బుత‌మైన పోరాట ప‌టిమ క‌న‌బ‌రిచంద‌ని బుమ్రా చెప్పుకొచ్చాడు.

"కీల‌క మ్యాచ్‌లో ఓడిపోవడం తీవ్ర నిరాశ‌ప‌రిచింది. అంతేకాకుండా గాయంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయకపోవడం కాస్త‌ అసహనానికి గురి చేసింది. కానీ కొన్నిసార్లు మ‌న శ‌రీరానికి ప్ర‌ధాన్య‌త ఇవ్వాల్సి ఉంటుంది.మన శరీరంతో మనం పోరాడలేం.

ఈ సిరీస్‌లోనే బాగా బౌలింగ్‌కు అనుకూలించిన వికెట్‌పై బౌలింగ్ చేసే అవ‌కాశాన్ని కోల్ప‌వ‌డం బాధ‌గా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌ నా సెకెండ్ స్పెల్ సమయంలోనే కాస్త అసౌకర్యంగా అనిపించింది. దీంతో మా కుర్రాళ్ల‌తో చర్చించి బ‌య‌ట‌కు వెళ్లిపోయాను. మొద‌టి ఇన్నింగ్స్‌లో కూడా ఒక బౌలర్ లోటుతోనే ఆడాము. 

అయిన‌ప్ప‌ట‌కి మిగితా బౌల‌ర్లు బాధ్య‌త తీసుకుని అద్బుతంగా రాణించారు. ఈ రోజు ఉద‌యం కూడా మా బౌల‌ర్లతో మాట్లాడి వారిలో ఆత్మ‌విశ్వాసం నింపే ప్ర‌య‌త్నం చేశాను. ఆఖ‌రి ఇన్నింగ్స్‌లో కూడా అద‌న‌పు బాధ్య‌త తీసుకోవాల్సి ఉంటుంది అని వారితో చెప్పాను. ఏద‌మైన‌ప్ప‌టికి ఆస్ట్రేలియాకు మేము గ‌ట్టిపోటీ ఇచ్చాము. సిరీస్ మొత్తం హోరాహోరీగా సాగింది. ఈ సిరీస్ ఏకప‌క్షంగా సాగ‌లేదు. మేము ఆఖ‌రి వ‌ర‌కు అద్బుతంగా పోరాడాము. టెస్టు క్రికెట్ అంటే ఇలానే ఉంటుంది.

గేమ్‌లో ఉండాలంటే ప్ర‌త్య‌ర్ధిపై ఒత్తిడికి గురిచేయ‌డం, పరిస్థితికి అనుగుణంగా ఆడటం వంటివి చాలా ముఖ్యమైనవి. ఈ సిరీస్ నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాము. భ‌విష్య‌త్తులో అవి క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మా జట్టులో చాలా మంది కుర్రాళ్లు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు రావడం ఇదే తొలిసారి.

వారు కూడా లా అనుభవాన్ని పొందారు. ఈ సిరీస్‌తో టీమ్‌లో టాలెంట్ ఉన్న ఆట‌గాళ్లు ఉన్నార‌ని ప్రపంచానికి చూపించాము. కుర్రాళ్లు గెల‌వ‌లేద‌ని నిరాశ‌తో ఉన్నారు. కానీ ఈ ఓట‌మిని నుంచి చాలా గుణ‌పాఠాలు నేర్చుకుంటారు. ఇక విజేత‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు. వారు కూడా అద్బుతంగా పోరాడ‌ర‌ని" పోస్ట్‌మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో బుమ్రా పేర్కొన్నాడు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)