Breaking News

అతడొక ఫినిషర్‌.. తనకు తెలిసిందల్లా ఒక్కటే: దినేష్‌ కార్తీక్‌

Published on Mon, 09/01/2025 - 18:17

ఆర్సీబీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జితేష్ శర్మ ఏడాది విరామం త‌ర్వాత తిరిగి టీమిండియా త‌ర‌పున ఆడేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఆసియాక‌ప్‌-2025కు ఎంపిక చేసిన భార‌త జ‌ట్టులో అతడికి చోటు ద‌క్కింది. వికెట్ కీప‌ర్ కోటాలో సంజూ శాంస‌న్‌, జితేష్‌కు మ‌ధ్య పోటీ నెల‌కొంది.

ఒక‌వేళ డౌన్‌ది ఆర్డ‌ర్‌లో ఫినిష‌ర్ కావాల‌ని టీమ్ మెనెజ్‌మెంట్‌ భావిస్తే సంజూకు బ‌దుల‌గా జితేష్‌కు తుది జ‌ట్టులో చోటు దక్కే అవ‌కాశ‌ముంది. సంజూ శాంస‌న్ ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. కేర‌ళ టీ20లో శాంస‌న్ ప‌రుగుల వ‌రద పారిస్తున్నాడు. మరోవైపు జితేష్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. 

ఐపీఎల్‌-2025 త‌ర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ విధర్బ ఆట‌గాడు.. భారీ షాట్ల ఆడ‌టంలో దిట్ట‌. ముఖ్యంగా డౌన్‌ది ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చి జ‌ట్టుకు మంచి ఫినిషింగ్ అందించగ‌లడు. ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియ‌న్‌గా ఆర్సీబీ నిల‌వ‌డంలో జితేష్‌ది కీల‌క పాత్ర‌. 

ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో 31 ఏళ్ల జితేష్ 15 మ్యాచ్‌లు ఆడి 37 సగటు, 76 స్ట్రైక్ రేట్‌తో 261 పరుగులు చేశాడు. తాజాగా జితేష్ గురుంచి టీమిండియా మాజీ ఆట‌గాడు, ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్లడించాడు.

"టీమిండియా తరపున ఆడేందుకు జితేష్ శ‌ర్మ ఎప్పుడూ అంత‌గా ఆరాట‌ప‌డలేదు. అత‌డికి తెలిసింది ఒక్క‌టే. ఇన్నింగ్స్‌ను ఎలా పూర్తి చేయాలి? త‌న ఆడే జ‌ట్టును అత్యుత్త‌మ స్దాయికి ఎలా తీసుకుకెళ్లాలి? అని ఆలోచిస్తాడు. త‌న ప‌ని తాను చేసుకుపోవ‌డంపై ఎక్కువ‌గా దృష్టి పెడతాడు. 

అందుకే ఆఖరిలో వచ్చి అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగల్గుతున్నాడు. భారీ ఇన్నింగ్స్‌లు ఎలా ఆడాలో, డిఫెన్స్ ఆడుతూ జట్టును ముందుకు ఎలా తీసుకు వెళ్లాలో అతడికి ఇప్పటికి తెలియదు. కానీ అతడికి అద్బుతమైన స్కి‍ల్స్ ఉన్నాయి. 

కాబట్టి జితేష్‌ను ఎలా సరిదిద్దాలో నాకు తెలుసు. అతడికి భారీ షాట్లు ఆడే సత్తా ఉంది. అంతేకాకుండా స్ట్రైట్‌గా సిక్సర్లు కొట్టగలడు. అయితే రివర్స్ స్కూప్‌, ల్యాప్ షాట్లు వంటివి ఆడలేడు" అని క్రిక్‌బజ్‌కు ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున మెరుగైన ప్రదర్శన అనంతరం జితేష్‌ టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.
చదవండి: టాప్‌-5 క్రికెటర్లలో కోహ్లికి నో ఛాన్స్‌.. సారీ చెప్పిన డివిలియర్స్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)