నితీష్‌ రాణాపై ప్రతీకారం తీర్చుకున్న దిగ్వేష్‌ రాఠీ

Published on Mon, 08/03/2026 - 20:49

పురానీ ఢిల్లీ 6 స్పిన్నర్‌ దిగ్వేష్‌ సింగ్‌ రాఠీ, వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌ బ్యాటర్‌ నితీష్‌ రాణా మధ్య గత సీజన్‌ ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో జరిగిన వివాదానికి ఆసక్తికరమైన ముగింపు లభించింది.

గత సీజన్‌ ఎలిమినేటర్‌లో రాఠీ, రాణా ఒకరినొకరు కవ్వించుకోగా.. రాణా బ్యాట్‌తో పైచేయి సాధించాడు. ప్రస్తుత సీజన్‌లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరు మరోసారి ఎదురెదురుపడగా.. రాణాను ఔట్‌ చేసి రాఠీ రివెంజ్‌ తీర్చుకున్నాడు. ఈ ప్రతీకార పర్వం క్రికెట్‌ అభిమానులను అమితంగా ఆకర్షించింది.

వివరాల్లోకి వెళితే​.. గత సీజన్‌ ఎలిమినేటర్‌లో రాణా-రాఠీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాఠీ బంతి వేయడానికి వచ్చి చివరి క్షణంలో ఆగడంతో రాణా కూడా అదే తరహాలో స్పందించాడు. ఆ తర్వాత రాఠీ బౌలింగ్‌లో రాణా భారీ సిక్సర్‌ కొట్టి, అతడి నోట్‌బుక్‌ సెలబ్రేషన్‌ను అతడికే అప్పజెప్పాడు.

ఆ మ్యాచ్‌లో రాణా 55 బంతుల్లో అజేయమైన 134 పరుగులు చేసి వెస్ట్‌ ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ఆ వివాదానికి సంబంధించి అప్పుడు రాఠీ మ్యాచ్‌ ఫీజులో 80 శాతం, రాణా 50 శాతం జరిమానా విధించారు.

తాజాగా జరిగిన మ్యాచ్‌లో రాఠీ రాణాను ఔట్‌ చేసి, గత సీజన్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. 11వ ఓవర్‌ చివరి బంతికి రాఠీ వేసిన బంతిని రాణా రివర్స్‌ స్వీప్‌ చేసేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్‌కు తగలకుండా ముందు ప్యాడ్‌కు తగలడంతో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రాణా కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు.

గత సీజన్‌ చెడు అనుభవం దృష్ట్యా రాఠీ సాధారణంగానే సంబరాలు చేసుకున్నాడు. తన స్టయిల్‌లో నోట్‌బుక్‌ సెలబ్రేషన్‌ చేసుకోలేదు. అతడు కామ్‌గానే ఉన్నా, పరోక్షంగా రాణాపై ప్రతీకారం​ తీర్చుకున్నట్లైంది. ఈ ఉదంతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌ 180 పరుగులు చేయగా.. పురానీ ఢిల్లీ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.  పురానీ ఢిల్లీ విజయంలో దేవ్‌ లక్రా (64), అనూజ్‌ రావత్‌ (49 నాటౌట్‌), లలిత్‌ యాదవ్‌ (30 నాటౌట్‌) కీలకపాత్ర పోషించారు. రాఠీకి కేవలం రాణా వికెట్‌ మాత్రమే లభించింది. 

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)