Breaking News

'ఇద్దరం ఒకే జట్టుకు ఆడాము.. అయినా నన్ను స్లెడ్జ్‌ చేశాడు'

Published on Sun, 09/15/2024 - 10:27

టీమిండియా యువ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ధ్రువ్ జురెల్ అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి జురెల్ అడుగుపెట్టాడు. హైదారాబాద్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో గాయ ప‌డిన కేఎల్ రాహుల్ స్ధానంలో ధ్రువ్ ఎంట్రీ ఇచ్చాడు. 

రాంచీ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన నాలుగో టెస్టులో 90 ప‌రుగుల‌తో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన జురెల్ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే తాజాగా త‌న డెబ్యూ టెస్టులో ఇంగ్లండ్ ఆట‌గాళ్ల నుంచి ఎదురైన అనుభ‌వాల‌ను ధ్రువ్ పంచుకున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌లో కలిసి ఆడిన జో రూట్ సైతం  త‌నను స్లెడ్జింగ్ చేయడం ఆశ్చ‌ర్య‌ప‌రిచంద‌ని ధ్రువ్ చెప్పుకొచ్చాడు.

రాంచీ టెస్టుల్లో నేను 32 ప‌రుగుల వ‌ద్ద బ్యాటింగ్ చేస్తున్నాను. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకుంది. కొత్త బంతి తీసుకోవ‌డంతో జేమ్స్ ఆండ‌ర్స‌న్ ఎటాక్‌లోకి వ‌స్తాడ‌ని నేను ముందే ఊహించాను. అత‌డు అప్ప‌టికే కొంచెం దూకుడుగా ఉన్నాడు. ఎందుకంటే మా భాగస్వామ్యం నెమ్మ‌దిగా పెరుగుతుంద‌ని వారికి తెలుసు.

మా భాగ‌స్వామ్యాన్ని ఎలా అయినా బ్రేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో నన్ను స్లెడ్జింగ్ చేయడం మొద‌లు పెట్టారు. కానీ నేను వారి మాటల‌ను ప‌ట్టించుకోక‌డ‌ద‌ని డిసైడ్ అయ్యాను. వారు నా ఏక‌గ్రాత‌ను దెబ్బ‌తీయ‌డానికి ప్ర‌య‌త్నించారు. జానీ బెయిర్‌స్టో అయితే కంటిన్యూగా ఏదో ఒక‌టి అంటూ వున్నాడు.

అత‌డితో జో రూట్ కూడా చేరాడు. ఐపీఎల్‌లో జో రూట్ క‌లిసి ఆడాము. అయిన‌ప్ప‌ట‌కి అత‌డు నన్ను స్లెడ్జ్ చేయ‌డంతో షాక్ అయ్యాను. వెంట‌నే  జో రూట్ భాయ్ మీరు నన్ను ఎందుకు స్లెడ్జింగ్ చేస్తున్నారు? అని అడిగాను. ఇది నా వృత్తి ధర్మం​. మనమందరం ఇప్పుడు మన దేశం కోసం ఆడుతున్నాము అని రూట్‌ బదలిచ్చాడని ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువ్‌ పేర్కొన్నాడు. కాగా ధ్రువ్‌ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)