Breaking News

ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. తుది జట్టులో ధృవ్‌ జురెల్‌..?

Published on Fri, 11/08/2024 - 19:51

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌ నవంబర్‌ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరంగా ఉండనున్నాడని తెలుస్తుంది. రోహిత్‌ భార్య రితిక సజ్దే రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో అతను పితృత్వ సెలవులో ఇండనున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో టీమిండియా బ్యాకప్‌ ఓపెనర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రోహిత్‌ లీవ్‌ విషయం ముందే తెలిసి టీమిండియా మేనేజ్‌మెంట్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాకప్‌ ఓపెనర్‌గా ఉపయోగపడతాడని ఆస్ట్రేలియాకు పంపింది. అయితే రాహుల్‌ ఆసీస్‌-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్‌లో దారుణంగా విఫలమయ్యాడు. రాహుల్‌తో పాటు మరో బ్యాకప్‌ ఓపెనర్‌గా పరిగణించబడిన అభిమన్యు ఈశ్వరన్‌ కూడా రెండు అనధికారిక టెస్ట్‌ల్లో చేతులెత్తేశాడు. వీరిద్దరితో పాటు ఓపెనర్‌ రేసులో ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌ సైతం దారుణంగా నిరాశ పరిచాడు.

ఈ నేపథ్యంలో రెండో అనధికారిక టెస్ట్‌లో అద్భుతంగా ఆడిన వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ ధృవ్‌ జురెల్‌ను రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయాలని అభిమానులు కోరుతున్నారు. యశస్వి జైస్వాల్‌కు జతగా శుభ్‌మన్‌ గిల్‌ను ఓపెనర్‌గా పంపించి జురెల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఆసీస్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో అందరూ విఫలమైన వేల జురెల్‌ సూపర్‌గా బ్యాటింగ్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 186 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతులు ఎదుర్కొని 19 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఆసీస్‌తో తొలి టెస్ట్‌ సమయానికి రోహిత్‌ అందుబాటులో ఉండకపోతే జురెల్‌నే ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపిక చేయడం​ మంచిందని అందరూ అనుకుంటున్నారు. మరి టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఏం చేస్తుందో వేచి చూడాలి. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)