Breaking News

IND VS AUS: శతక్కొట్టిన ధృవ్‌ జురెల్‌.. టీమిండియా భారీ స్కోర్‌

Published on Thu, 09/18/2025 - 17:15

లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు భారీ స్కోర్‌ చేసింది. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ధృవ్‌ జురెల్‌ మెరుపు శతకంతో చెలరేగాడు. 115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన జురెల్‌.. 113 పరుగుల వద్ద (132 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.

మరో ఎండ్‌లో జురెల్‌కు జోడీగా ఉన్న దేవ్‌దత్‌ పడిక్కల్‌ కూడా సెంచరీకి చేరువయ్యాడు. పడిక్కల్‌ 178 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అంతకుముందు సాయి సుదర్శన్‌ (73), ఎన్‌ జగదీసన్‌ (64) అర్ద సెంచరీలతో రాణించగా.. అభిమన్యు ఈశ్వరన్‌ (44) పర్వాలేదనిపించాడు. భారత-ఏ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (8) ఒక్కడే విఫలమయ్యాడు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత-ఏ స్కోర్‌ 103 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 403 పరుగులుగా ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా-ఏ 532 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. సామ్‌ కొన్‌స్టాస్‌ (109), వికెట్‌ కీపర్‌ జోష్‌ ఫిలిప్‌ (123 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్‌బెల్‌ కెల్లావే (88), కూపర్‌ కన్నోల్లీ (70), లియమ్‌ స్కాట్‌ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు.

కాగా, రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు, మూడు అనధికారిక​ వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)