Breaking News

ఈ జట్టుతో మామూలుగుండదు.. అత్యంత ప్రమాదకరమైంది..!

Published on Wed, 02/04/2026 - 11:51

త్వరలో ప్రారంభం​ కానున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా అభివర్ణించాడు. ఈ జట్టులో అవసరమైన అన్ని అంశాలు (అనుభవం, బలమైన బ్యాటింగ్‌, అద్భుతమైన బౌలింగ్‌) సమగ్రంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. 

అయితే రాత్రి వేళల్లో తేమ ప్రభావం ఆందోళన కలిగిస్తుందని అన్నాడు. ఈ విషయంలో టీమిండియా అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించాడు. టాస్‌ చాలా కీలకమవుతుందని అంచనా వేశాడు. మాహి అన్‌ప్లగ్డ్‌ అనే కార్యక్రమం సందర్భంగా ధోని ఈ విషయాలను షేర్‌ చేసుకున్నాడు.

కోహ్లి, రోహిత్‌ ఎందుకు ఆడకూడదు..?
ఇదే కార్యక్రమం సందర్భంగా ఇంటర్వూయర్‌ ధోనిని విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ గురించి అడిగాడు. వారిద్దరు 2027 వన్డే వరల్డ్‌కప్‌ ఆడగలరా అని ప్రశ్నించాడు. దీనిపై ధోని స్పందిస్తూ.. ఆటగాళ్లకు వయసు ఎప్పుడూ ప్రమాణం కాదు. ప్రదర్శన మరియు ఫిట్‌నెస్‌ మాత్రమే అసలు ప్రమాణాలు. దేశం కోసం కృషి చేయాలనుకున్నప్పుడు ఎవరినైనా ఎందుకు ఆపాలి.

అనుభవం ఒక్కసారిగా రాదు. 20 ఏళ్ల ఆటగాడికి అనుభవం ఉండదు, సచిన్ టెండూల్కర్‌ లాంటి అసాధారణ ప్రతిభ తప్ప. కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. ప్రదర్శన ఉంటే జట్టులో ఉంటారు, లేకపోతే ఉండరు అని అన్నాడు.

ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంది. ఇటీవలికాలంలో ధోని చెప్పినట్లుగానే టీమిండియా చాలా ప్రమాదకరంగా ఉంది. అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 51-8 విన్-లాస్‌ రికార్డు సాధించింది. 

సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో టీమిండియా అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టమైన జట్టుగా ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ సూర్యతో పాటు ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, శివమ్‌ దూబే అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, వరుణ్ చక్రవర్తి ఉరకలేస్తున్నారు. ప్రపంచకప్‌లో వీరిని ఆపడం ఏ జట్టుకైనా సామర్థ్యానికి మించిన పనే అవుతుంది. 

భారత్‌ తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో జరిగే మ్యాచ్‌తో మొదలుపెడుతుంది. భారత్‌.. పాకిస్తాన్‌, యూఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌ జట్లతో గ్రూప్‌-ఏలో ఉంది. ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అనుమానంగా ఉంది. భద్రతా కారణాలంటూ ఈ మ్యాచ్‌ను పాక్‌ బాయ్‌కాట్‌ చేసుకుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)