Breaking News

సిరీస్‌ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయిన డెవాన్‌ కాన్వే

Published on Thu, 06/11/2026 - 18:39

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో, ఆమెతో ఉండేందుకు తాత్కాలికంగా జట్టును వీడాడు.

రెండో టెస్ట్‌ జూన్‌ 17న మొదలు కావాల్సి ఉండగా.. ఆ సమయానికంతా అతడు జట్టుతో కలుస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాన్వే తన తొలి సంతానం జనన సమయంలోనూ ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ను మిస్ అయ్యాడు. ఒకవేళ కాన్వే రెండో టెస్ట్‌ సమయానికి అందుబాటులోకి రాకపోతే కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌తో కలిసి రచిన్‌ రవీంద్ర ఓపెనింగ్‌ చేస్తాడు.

కాగా, న్యూజిలాండ్‌ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం​ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇప్పటికే తొలి టెస్ట్‌ పూర్తి కాగా, ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చిత్తుగా ఓడింది. ఆ మ్యాచ్‌లో కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో (1) విఫలమైనా, రెండో ఇన్నింగ్స్‌లో (41) పర్వాలేదనిపించాడు. కాన్వే ఇటీవలికాలంలో బ్యాటింగ్‌లో స్థిరత్వంలేక ఇబ్బందిపడుతున్నాడు. ఓ సిరీస్‌లో రాణిస్తే, మరో సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. తాజాగా విండీస్‌తో జరిగిన సిరీస్‌లో అతడు 452 పరుగులతో సత్తా చాటాడు.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్‌ విజయం తర్వాత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, పేస్‌ బౌలర్‌ గస్‌ అట్కిన్సన్‌ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆ మ్యాచ్‌ గెలిచిన ఆనందంలో వారిద్దరు నిబంధనలు ఉల్లంఘించి నైట్‌క్లబ్‌లో పార్టీ చేసుకోవడంతో పాటు అక్కడు ఓ రగ్బీ ఆటగాడితో గొడవకు దిగారు. 

అక్కడ స్టోక్స్‌ తాగిన మత్తులో సదరు రగ్బీ ఆటగాడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఈసీబీ.. స్టోక్స్‌, అట్కిన్సన్‌ నిబంధనలు ఉల్లంఘించారని నిర్దారించి వారిని రెండో టెస్ట్‌ నుంచి తప్పించింది. స్టోక్స్‌ గైర్హాజరీలో రూట్‌ను తాత్కాలిక సారధిగా ప్రకటించింది. 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)