Breaking News

BCCI: తగ్గిన ఐసీసీ వాటా

Published on Fri, 12/26/2025 - 08:53

ముంబై: టీమ్‌ ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్‌ ఎలెవన్‌ అర్ధాంతరంగా తప్పుకొన్న తర్వాత కూడా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయానికి ఎలాంటి సమస్యా ఎదురు కాలేదు. ఎక్కువ మొత్తానికి అపోలో టైర్స్‌తో స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు కిట్‌ స్పాన్సర్‌ అడిడాస్‌ ద్వారా బోర్డు ఆ లోటును పూరించుకుంది. 

రూ. 3,358 కోట్లు పెరుగుదల
బోర్డు సంయుక్త కార్యదర్శి (గత కోశాధికారి) ప్రభ్‌తేజ్‌ భాటియా రాబోయే 2025–26 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ (BCCI) ఆదాయ అంచనాల గురించి వివరిస్తూ గత ఏడాది 2024–25కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

దీని ప్రకారం గత ఏడాది బోర్డు ప్రాథమిక నిధిలో రూ. 3,358 కోట్లు పెరుగుదల కనిపిస్తూ మొత్తం రూ.11,346 కోట్లకు చేరింది.  అపోలో టైర్స్‌తో రూ. 358 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న బీసీసీఐ... జెర్సీ స్పాన్సర్‌ అడిడాస్‌ నుంచి కూడా పెద్ద మొత్తాన్ని పొందినట్లు సమాచారం. 

తగ్గిన ఐసీసీ వాటా
అయితే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నుంచి ప్రతీ ఏటా వచ్చే ఆదాయంలో మాత్రం కోత పడిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ప్రతీ ఏడాది ఐసీసీ తమ ఆదాయం నుంచి భారత బోర్డుకు 38.5 శాతం అందిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐకి రూ.8,963 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. 

చదవండి: టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!? 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)