Breaking News

102 ఎకరాల స్థలం.. అప్పుడు రూ.900 కోట్లతో..

Published on Tue, 11/11/2025 - 10:28

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియాన్ని (Jawaharlal Nehru Stadium) పూర్తిగా కూల్చేసి పునర్‌ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అత్యాధునిక వసతులతో సిద్ధం చేసి దానిని ‘స్పోర్ట్స్‌ సిటీ’గా మార్చనున్నారు. అన్ని రకాల ప్రధాన క్రీడలకు కేంద్రంగా దీనిని రూపుదిద్దాలనే ప్రణాళిక సిద్ధమైందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

102 ఎకరాల స్థలం
స్టేడియానికి సంబంధించి ప్రస్తుతం 102 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. పూర్తి ఖర్చు, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) సహా ఇప్పుడు స్టేడియంలోనే ఉన్న కార్యాలయాలన్నీ మరో చోటుకు తరలించనున్నారు.

ఖతర్, ఆస్ట్రేలియాలలో ఉన్న స్పోర్ట్స్‌ సిటీ నమూనాలను నెహ్రూ స్టేడియం నిర్మాణం కోసం పరిశీలిస్తున్నారు. కాగా 1982లో ఆసియా క్రీడల సందర్భంగా నిర్మించిన ఈ స్టేడియాన్ని 2010లో కామన్వెల్త్‌ క్రీడల కోసం రూ.900 కోట్లతో ఆధునీకరించారు.  

320 మంది అసిస్టెంట్‌ కోచ్‌ల ఎంపిక... 
దేశవ్యాప్తంగా 320 మంది అసిస్టెంట్‌ కోచ్‌లను ఎంపిక చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. 25 రకాల క్రీడాంశాల్లో వీరిని నియమించేందుకు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 

‘సాయ్‌’ కేంద్రాల్లో వీరిని నియమిస్తారు. అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించే లక్ష్యంతో ‘మెడల్‌ స్ట్రాటజీ’ అంటూ రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా ఈ కోచ్‌లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ 320 మందిలో 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు.

చదవండి: వన్డే ఆల్‌టైమ్‌ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్‌కు దక్కని చోటు

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)