IPl 2024 DC Vs RR: శాంసన్‌ ఇన్నింగ్స్‌ వృథా.. రాజస్తాన్‌పై ఢిల్లీ ఘన విజయం

Published on Tue, 05/07/2024 - 23:33

ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో 20  పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైంది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితమైంది. 

రాజస్తాన్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ సంజూ శాంసన్‌ 86 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్‌ ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. మిగితా బ్యాటర్ల నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లు రాకపోవడంతో రాజస్తాన్‌ ఓడిపోయింది. 

ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, ఖాలీల్‌ అహ్మద్‌, ముఖేష్‌ కుమార్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్‌ పటేల్‌, రసిఖ్ దార్ సలామ్ చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్‌ ఫ్రెజర్‌ మెక్‌ గర్క్‌(20 బంతుల్లో 50), అభిషేర్‌ పోరెల్‌(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ మెరుపులు మెరిపించాడు.

20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్‌.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్‌ బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్‌, బౌల్ట్‌, సందీప్‌ శర్మ తలా వికెట్‌ సాధించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)