Breaking News

Hundred League: అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీసిన దీప్తి శర్మ

Published on Mon, 08/19/2024 - 13:57

మహిళల హండ్రెడ్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో లండన్‌ స్పిరిట్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీసింది. నిన్న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన దీప్తి.. తన జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టింది. నిన్నటి మ్యాచ్‌లో లండన్‌ గెలవాలంటే చివరి మూడు బంతులకు నాలుగు పరుగులు అవసరం కాగా.. దీప్తి సిక్సర్‌ బాది మ్యాచ్‌ను ముగించింది. ఫైనల్లో దీప్తి చేసింది 16 పరుగులే అయినా జట్టు విజయానికి అవెంతో దోహదపడ్డాయి.

హండ్రెడ్‌ లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌ నుంచి దీప్తి ఇలాంటి ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఈ సీజన్‌లో బ్యాట్‌తో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమె.. 212 సగటున, 132.50 స్ట్రయిక్‌రేట్‌తో 212 పరుగులు చేసింది. ఇందులో దీప్తి వ్యక్తిగత అత్యధిక స్కోర్‌ 46 నాటౌట్‌ కాగా.. 18 బౌండరీలు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన దీప్తి.. 6.85 ఎకానమీతో ఎనిమిది వికెట్లు తీసింది. వెల్ష్‌ ఫైర్‌తో నిన్న జరిగిన ఫైనల్లో దీప్తి ఎల్విస్‌ వికెట్‌ పడగొట్టింది. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)