Breaking News

ఆసీస్‌తో రెండో టీ20.. టీమిండియా ఆల్‌రౌండర్‌ అరుదైన రికార్డు

Published on Mon, 01/08/2024 - 12:12

నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా  ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా దీప్తికి ముందు ఈ ఘనతను మరో ముగ్గురు మహిళా క్రికెటర్లు సాధించారు. పాకిస్తాన్‌కు చెందిన నిదా దార్‌ (1839 పరుగులు, 130 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్‌ పెర్రీ (1750 పరుగులు, 123 వికెట్లు), న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్‌ (3107 పరుగులు, 113 వికెట్లు) టీ20ల్లో అరుదైన డబుల్‌ను సాధించారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. దీప్తి శర్మ (30) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. భారత ఇన్ని​ంగ్స్‌లో దీప్తితో పాటు రిచా ఘోష్‌ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.  ఆసీస్‌ బౌలర్లలో జార్జీయా వేర్హమ్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, కిమ్‌ గార్త్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్‌నర్‌ ఓ వికెట్‌ దక్కించుకుంది. 

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌.. 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అలైసా హీలీ 26, బెత్‌ మూనీ 20, తహిల మెక్‌గ్రాత్‌ 19, ఎల్లిస్‌ పెర్రీ 34 నాటౌట్‌, ఆష్లే గార్డ్‌నర్‌ 7, లిచ్‌ఫీల్డ్‌ 18 నాటౌట్‌ తలో చేయి వేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. బ్యాట్‌తో రాణించిన దీప్తి బంతితోనూ సత్తా చాటింది. 4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది.  శ్రేయాంక పాటిల్‌, పూజా వస్త్రాకర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ నెగ్గగా.. ఆసీస్‌ రెండో టీ20 గెలిచింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌ జనవరి 9న జరుగనుంది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)