Breaking News

ఐపీఎల్‌కు ముందు చెన్నైకి గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆటగాడు వచ్చేస్తున్నాడు!

Published on Tue, 02/21/2023 - 15:20

గత కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించాడు. దీంతో ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున బరిలోకి దిగేందుకు చాహర్‌ సిద్దమయ్యాడు. దీపక్‌ చహర్‌ చివరగా భారత్‌ తరుపున గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఆడాడు.

అయితే ఈ మ్యాచ్‌లో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేసిన అతడికి వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతడు మిగిలిన సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. 2022 ఏడాదిలో కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే భారత్‌ తరపున ఆడాడు. అదే విధంగా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు కూడా  చాహర్‌ దూరమయ్యాడు. ఇక  చాహర్‌ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన పలు విషయాలును పీటీఐతో వెల్లడించాడు.

"నేను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి గత రెండు  మూడు నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాను. ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం ఇప్పటినుంచే నేను సన్నద్దం అవుతున్నాను. పూర్తి ఫిట్‌నెస్‌గా ఉండి బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రాణించడమే నా లక్ష్యం. ఏ జట్టుకు ఆడిన 100 శాతం ఎఫక్ట్‌ పెడతాను. అంతే తప్ప నా గురించి ఎవరు ఏమీ మాట్లాడిన నేను  పట్టించుకోను" అని పీటీఐతో దీపక్‌ చాహర్‌ పేర్కొన్నాడు.

తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌
ఐపీఎల్‌-2023 ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా ఈవెంట్‌ జరుగనుంది. నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే), డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే తొలి పోరుతో ఐపీఎల్‌–16 ప్రారంభం కానుంది. ఇక ఫైనల్‌ మే 28న జరుగనుంది.
చదవండి: Suryakumar Yadav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)