Breaking News

వెస్టిండీస్‌-న్యూజిలాండ్‌ వన్డేలో 'హిట్‌ వికెట్‌' వివాదం

Published on Sun, 07/12/2026 - 16:28

వెస్టిండీస్-న్యూజిలాండ్ మధ్య ఇవాళ (జులై 12) జరిగిన తొలి వన్డేలో ఓ వివాదాస్పద అంశం చోటు చేసుకుంది. విండీస్‌ ఆటగాడు కీసీ కార్టీ బ్యాట్‌ స్టంప్స్‌ను తాకి బెయిల్స్ కిందపడినా టీవీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది.

267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ పటిష్ఠ స్థితిలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 35వ ఓవర్ రెండో బంతిని జాకబ్ డఫీ వేయగా, కార్టీ పుల్ షాట్ ఆడి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా 69 మీటర్ల సిక్సర్ బాదాడు. అయితే షాట్ ఆడిన వెంటనే అతని బ్యాట్ స్టంప్స్‌ను తాకడంతో బెయిల్స్ కిందపడ్డాయి.

దీంతో ఫీల్డ్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ వెంటనే స్క్వేర్ లెగ్ అంపైర్‌తో చర్చించి నిర్ణయాన్ని టీవీ అంపైర్ అహ్సన్ రజాకు పంపించాడు. అప్పటికి కార్టీ 64 పరుగులతో క్రీజులో ఉండగా, వెస్టిండీస్ 34 ఓవర్లలో 170/2తో విజయానికి చేరువలో ఉంది.

పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్ కార్టీని నాటౌట్‌గా ప్రకటించాడు. షాట్ పూర్తయిన తర్వాతే బ్యాట్ స్టంప్స్‌ను తాకిందని, అప్పటికే బంతి సిక్సర్‌గా బౌండరీ దాటినందున హిట్ వికెట్ నిబంధన వర్తించదని స్పష్టం చేశాడు.

ఎంసీసీ క్రికెట్ నిబంధనల ప్రకారం బంతి ఆటలో ఉన్న సమయంలో మాత్రమే హిట్ వికెట్‌గా బ్యాటర్‌ను ఔట్ ఇవ్వవచ్చు. షాట్ ఆడే సమయంలో లేదా వెంటనే పరుగుకు బయలుదేరే క్రమంలో స్టంప్స్‌ను కూల్చితే మాత్రమే హిట్ వికెట్ వర్తిస్తుంది. 

కానీ బంతి అప్పటికే బౌండరీ దాటి ఫోర్ లేదా సిక్సర్‌గా నమోదైన తర్వాత ఆట ముగిసినట్లే పరిగణిస్తారు. ఆ తర్వాత స్టంప్స్‌ను తాకినా బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించలేరు.

అంపైర్ నిర్ణయం అనంతరం కార్టీ మరింత ధైర్యంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.

ఈ ఘటనతో హిట్ వికెట్ నిబంధన చర్చనీయాంశంగా మారింది. 2005 యాషెస్‌లో షేన్ వార్న్, 2002లో ఇంజమామ్ ఉల్ హక్ వంటి ప్రముఖ ఆటగాళ్లు హిట్ వికెట్‌గా ఔటైన ఘటనలను అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)