Breaking News

రిటైర్మెంట్‌ నిర్ణయం వెనక్కు తీసుకునేందుకు రెడీ: వార్నర్‌

Published on Tue, 10/22/2024 - 18:37

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా తాజా మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీజీటీలో ఆడేందుకు తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు. ఈ ఏడాది జనవరిలో టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్‌ తిరిగి బ్యాగీ గ్రీన్‌ ధరించేందుకు సన్నద్దత వ్యక్తం చేశాడు. వార్నర్‌ రిటైర్మెంట్‌తో ఆసీస్‌కు ఓపెనర్‌ సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. 

ఉస్మాన్‌ ఖ్వాజాకు జోడీగా స్టీవ్‌ స్మిత్‌ను ప్రయోగించినప్పటికీ.. అది ఆశించిన ఫలితాలు అందించలేదు. దీంతో వార్నర్‌ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. కోడ్‌ స్పోర్ట్స్‌ అనే వెబ్‌సైట్‌తో వార్నర్‌ మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నాడు. సెలెక్టర్ల నుంచి ఫోన్‌ రావడమే ఆలస్యమని ప్రకటించాడు. 

కాగా, బీజీటీకి ముందు ఆసీస్‌కు ఓపెనింగ్‌ సమస్యతో పాటు కామెరూన్‌ గ్రీన్‌ అందుబాటులో లేకపోవడం చాలా ఇబ్బందిగా మారింది. ఉస్మాన్‌ ఖ్వాజా జోడీ కోసం ఆసీస్‌ సెలక్టర్లు సామ్‌ కోన్‌స్టాస్‌, మార్కస్‌ హ్యారిస్‌ పేర్లను పరిశీలిస్తున్నారు. తాజాగా వార్నర్‌ ప్రకటన నేపథ్యంలో ఆసీస్‌ సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

స్టీవ్‌ స్మిత్‌ నాలుగో స్థానంలో రావడం దాదాపుగా ఖరారైంది. 37 ఏళ్ల డేవిడ్‌ వార్నర్‌ ఆసీస్‌ తరఫున 112 టెస్ట్‌లు ఆడి 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ద సెంచరీలు ఉన్నాయి. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ నవంబర్‌ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి.

చదవండి: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్‌ రహీం.. తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా రికార్డు

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)