Breaking News

భారత్‌-ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌.. స్టార్‌ ఆటగాడు ఔట్‌

Published on Tue, 11/21/2023 - 09:29

నవంబర్‌ 23 నుంచి భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు, వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌ (11 మ్యాచ్‌ల్లో 535 పరుగులు) డేవిడ్‌ వార్నర్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరం కానున్నాడు. విశ్రాంతి కోసం వార్నర్‌ చేసుకున్న విజ్ఞప్తిని ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు పరిగణలో​కి తీసుకుంది. దీంతో వరల్డ్‌కప్‌ ముగిసిన అనంతరమే వార్నర్‌ స్వదేశానికి పయనమయ్యాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ కోసం సీనియర్లెవ్వరినీ ఎంపిక చేయలేదు. ఆసీస్‌ టీమ్‌కు మాథ్యూ వేడ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్నర్‌ స్థానంలో ఆరోన్‌ హార్డీని జట్టులోకి తీసుకుంది.  

మరోవైపు భారత సెలెక్టర్లు కూడా ఈ సిరీస్‌కు సీనియర్లకు విశ్రాంతి కల్పించారు. వీరి గైర్హాజరీలో సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియా సారధిగా ఎంపికయ్యాడు. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు నిన్ననే టీమిండియాను ప్రకటించారు. కాగా, వన్డే వరల్డ్‌కప్‌ 2023 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఆ జట్టు టీమిండియాను ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. 

ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో భారత్‌, ఆసీస్‌ టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో గెలిచి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. సిరీస్‌లో ‌తొలి మ్యాచ్‌ (నవంబర్‌ 23) వైజాగ్‌ వేదికగా, రెండో టీ20 నవంబర్‌ 26న (తిరువనంతపురం), మూడో మ్యాచ్‌ నవంబర్‌ 28న (గౌహతి), నాలుగు (నాగ్‌పూర్‌), ఐదు టీ20లు (హైదరాబాద్‌) డిసెంబర్‌ 1, 3 తేదీల్లో జరుగనున్నాయి.  

ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్‌), ఆరోన్ హార్డీ, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్‌, కేన్‌ రిచర్డ్‌సన్, ఆడమ్‌ జంపా

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, శ్రేయస్ అయ్యర్ (చివరి రెండు మ్యాచ్‌లకు మాత్రమే).

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)