Breaking News

ఆసియా కప్ ఫైనల్‌లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

Published on Wed, 09/20/2023 - 13:41

ఆసియాకప్‌-2023 ఫైనల్లో భారత్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే కుప్పకూలింది.

ఈ ఘోర పరాభావం నేపథ్యంలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దసున్‌ షనకను జట్టు కెప్టెన్సీ నుంచి తొలిగించాలని శ్రీలంక క్రికెట్‌ భావిస్తున్నట్లు సమాచారం. భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందే లంక బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అతడి స్ధానంలో స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండీస్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పాలని శ్రీలంక క్రికెట్‌ ప్రణాళికలలు సిద్దం చేస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. త్వరలో జరగనున్న బోర్డు మీటింగ్‌లో ఈ విషయంపై చర్చించనున్నట్లు వినికిడి.

కెప్టెన్‌గా ఎన్నో రికార్డులు
శ్రీలంక జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన షనక జట్టును విజయ పథంలోనే నడిపించాడని చేప్పుకోవాలి. ఇప్పటివరకు దసున్ షనక కెప్టెన్సీలో 37 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. 23 విజయాలు సాధించింది. కేవలం 14 మ్యాచ్‌ల్లోనే ఓటమి పాలైంది.

కెప్టెన్‌గా అతడి విజయం శాతం  60.5గా ఉంది. అదే విధంగా షనక సారథ్యంలోనే  8 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌, 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక విజయం సాధించింది. గతేడాది ఆసియాకప్‌ను కూడా షనక నాయకత్వంలోని శ్రీలంకనే సొంతం చేసుకుంది.
చదవండి: IND vs AUS: అశ్విన్‌.. ఆసీస్‌తో ఆడినంత మాత్రాన సరిపోతుందా?: ఇర్ఫాన్‌ పఠాన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)