Breaking News

శ్రీలంక జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. స్టార్ ప్లేయ‌ర్లు రీ ఎంట్రీ

Published on Tue, 07/08/2025 - 15:13

బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల‌ టీ20 సిరీస్‌కు 17 మందితో స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును శ్రీలంక క్రికెట్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు చ‌రిత్ అసలంక(Charith Asalanka) సార‌థ్యం వ‌హించనున్నాడు. కాగా గ‌త కొంత‌కాలంగా జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండ‌ర్లు ద‌సున్ ష‌న‌క(Dasun Shanaka), చ‌మిక కరుణర‌త్నేల‌కు సెల‌క్ట‌ర్లు తిరిగి పిలుపునిచ్చారు.

అదేవిధంగా యువ పేస‌ర్  ఎషాన్ మలింగకు తొలిసారి లంక టీ20 జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఐపీఎల్‌, సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ లీగ్స్‌లో మలింగ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో సెల‌క్ట‌ర్ల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని సెల‌క్ట‌ర్లు టీ20 జ‌ట్టులోకి తీసుకున్నారు.

మలింగ‌కు డెత్‌లో బౌలింగ్ చేసే స‌త్తా ఉంది. ఇక ఈ జ‌ట్టులో కెప్టెన్ అస‌లంక‌తో కుశాల్ మెండిస్‌, నిస్సాంక‌, క‌మిందు మెండిస్ వంటి స్టార్ బ్యాట‌ర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో మ‌తీషా ప‌తిరాన‌, వానిండు హసరంగా, నువాన్ తుషారా వంటి కీల‌క ప్లేయ‌ర్లు ఉన్నారు.

కాగా ఈ సిరీస్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026 స‌న్నాహాల్లో భాగంగా జ‌ర‌గ‌నుంది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్‌ జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. కాగా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌న‌కు శ్రీలంక‌, భార‌త్‌లు సంయుక్తంగా ఆతిథ్య‌మివ్వ‌నున్నాయి. ఇక ఇప్ప‌టికే మూడు వ‌న్డేల సిరీస్‌లో శ్రీలంక‌, బంగ్లా జ‌ట్లు చెరో విజ‌యంతో స‌మంగా ఉన్నాయి. సిరీస్ ఫ‌లితాన్ని తేల్చే మూడో వ‌న్డే పల్లెక‌లే వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌రుగుతోంది.

బంగ్లాతో టీ20 సిరీస్‌కు శ్రీలంక జట్టు
చరిత్ అసలంక (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కుసల్ పెరీరా, కమిందు మెండిస్, అవిష్క ఫెర్నాండో, దసున్ షనక, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వందేర్సే, చమిక కరుణరత్నే, మతీషా పతిరనా, నువాన్ తుషార, బినుర ఫెర్నాండో, ఎషాన్ మలింగ.
చదవండి: అతడు కోహ్లి, టెండుల్కర్‌ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు: ఇంగ్లండ్‌ మాజీ బ్యాటర్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)