Breaking News

దసున్ షనక సెంచరీ వృధా.. శ్రీలంకపై భారత్‌ ఘన విజయం

Published on Tue, 01/10/2023 - 21:32

గౌహతి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 67పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేయగల్గింది. లంక కెప్టెన్ దసున్ షనక(108) ఆఖరి వరకు పోరాటం చేసినప్పటికీ తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.

లంక బ్యాటర్లలో షనకతో పాటు ఓపెనర్ నిస్సాంక 72 పరుగులతో అకట్టుకున్నాడు. ఇక భారత బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, షమీ,హార్దిక్, చాహల్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

టీమిండియా బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(113) అద్భుతమైన సెంచరీ సాధించగా.. రోహిత్‌ శర్మ (83), శుభ్‌మన్‌ గిల్‌ (70) అర్ధసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కసున్‌ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జనవరి 12న జరగనుంది.
చదవండి: IND vs SL: వారెవ్వా.. సిరాజ్‌ దెబ్బకు బిత్తరపోయిన లంక బ్యాటర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)