అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
శ్రీలంక కెప్టెన్ ప్రపంచ రికార్డు
Published on Sun, 02/08/2026 - 21:11
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనక ఓ చెత్త రికార్డు విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 8) ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన అతను.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక డకౌట్లైన (113 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు) ఆటగాడిగా అవతరించాడు. షనకకు ముందు ఈ రికార్డు జప్పి బిమెన్యిమనా (62 ఇన్నింగ్స్‌ల్లో 15) పేరిట ఉండేది. షనక, జప్పి తర్వాతి స్థానాల్లో పాల్ స్టిర్లింగ్ (158 మ్యాచ్‌ల్లో 14) ఉన్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ ఆదిలో శ్రీలంక ఆటగాళ్లను బాగానే కట్టడి చేసింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. 16 ఓవర్ల వరకు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగింది. ఆ సమయానికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అయితే ఆ ఓవర్ తర్వాత ఐర్లాండ్ బౌలర్లు లయ తప్పారు. అనవసర వైడ్లు, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా చివరి 4 ఓవర్లలో లంక ఆటగాళ్లు 59 పరుగులు పిండుకున్నారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
ఐరిష్ బౌలర్లలో జార్జియా డాక్రెల్ (4-0-17-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మార్క్ అదైర్ (4-0-33-1), గెరాత్ డెలానీ (4-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. మాథ్యూ హంఫ్రేస్ (4-0-44-0), బ్యారీ మెక్ కార్తీ (3-0-40-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
లంక ఇన్నింగ్స్‌లో కుసాల్ మెండిస్ (56 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. ఆఖర్లో కుసాల్ మెండిస్ (44) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 24, కమిల్ మిషారా 14, పవన్ రత్నాయకే 5, వెల్లాలగే 10, హసరంగ ఒక్క పరుగు చేయగా.. షనక డకౌటయ్యాడు.
Tags : 1