Breaking News

చరిత్ర సృష్టించిన డారిల్‌ మిచెల్‌..

Published on Sun, 01/18/2026 - 18:06

వన్డే క్రికెట్‌లో నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. అయితే కోహ్లి బాటలోనే న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ పయనిస్తున్నాడు. వన్డేల్లో ఈ కివీ స్టార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ కోహ్లి మాదిరిగానే నిలకడగా మారు పేరుగా మారాడు.

ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మిచెల్ సెంచరీలు మోత మ్రోగించాడు. వడోదర జరిగిన తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్‌.. ఆ తర్వాత రాజ్‌కోట్ వన్డేలో సెంచరీ(131)తో మెరిశాడు. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో మిచెల్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మిచెల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 

మిచెల్ ఆరంభంలో భారత పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను ఎదుర్కోవడంలో సంయమనం పాటించాడు. ఆ తర్వాత క్రీజులో కుదుర్కొన్నాక తనలోని విశ్వరూపాన్ని చూపించాడు.  106 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను మిచెల్ అందుకున్నాడు. మిచెల్‌కు ఇది 9వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా మొత్తంగా 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. భారత్‌పై అతడికి ఇదే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్‌పై గత ఐదు మ్యాచ్‌లలో అతడికి ఇది నాలుగో సెంచరీ.

ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన మిచెల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వ‌న్డేల్లో(టెస్టు క్రికెట్ హోదా క‌లిగిన దేశాలు) కనీసం 2000 పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక స‌గ‌టు క‌లిగిన బ్యాట‌ర్‌గా మిచెల్ చ‌రిత్ర సృష్టించాడు. మిచెల్ ఇప్పటివరకు 58.47 సగటుతో 2690 పరుగులు చేశాడు.

ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు వ‌న్డేల్లో 58.45 స‌గ‌టుతో 14673 ప‌రుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో కోహ్లిని మిచెల్ అధిగ‌మించాడు. వీరిద్ద‌రి త‌ర్వాతి స్ధానంలో భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌(56.34) ఉన్నాడు. ఇక ఈ సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో మిచెల్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్(106) సెంచ‌రీతో మెరిశాడు. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్  మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సిరాజ్, కుల్దీప్ త‌లా వికెట్ సాధించారు.
చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)