Breaking News

'మా దేశానికి టీమిండియా రావ‌ద్దు'.. పాక్‌ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

Published on Sat, 08/31/2024 - 18:03

ఛాంపియ‌న్స్‌-2025లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్ప‌ష్ట‌త లేదు. 
ఎట్టిపరిస్ధితుల‌లోనూ త‌మ జ‌ట్టును పాక్‌కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చేప్ప‌గా..పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భార‌త జ‌ట్టు త‌మ దేశానికి రావాల్సందేనని మొండి పట్టుతో ఉంది.

ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2023 ఆసియాకప్‌లో తలపడేందుకు కూడా భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. భారత్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంది. 

అయితే ఈ విషయంపై ఐసీసీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ  జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడంతో ఛాంపియన్స్‌ ట్రోఫీని ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ ఏడాది నవంబర్ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

మా దేశానికి రావద్దు..
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు పాకిస్తాన్‌కు రావద్దని కనేరియా సూచించాడు. ఆటగాళ్ల భద్రతకు మొదటి ప్రాధన్యం ఇవ్వాలని అతడు తెలిపాడు.

"పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితిని చూడండి. నేను అయితే టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లొద్దని చెబుతాను. ఈ విషయం గురుంచి పాకిస్తాన్ ఆలోచించాలి. దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప పీసీబీ ఎటువంటి డిమాండ్ చేయకూడాదు. 

నా వరకు అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే అవకాశముంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరిగే ఛాన్స్ ఉంది. ఆటగాళ్ల భద్రతే మొదటి ప్రాధాన్యత. 

ఆ తర్వాతే గౌరవం​, ఇంకా ఏమైనా. బీసీసీఐ అద్భుతంగా పనిచేస్తోంది. వారి నిర్ణయం ఏదైనా సరే, ఇతర దేశాలు కూడా అందుకు అంగీకరించాలి.  టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరిగితే బెటర్" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు.

కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్‌ను పీసీబీ ఇప్ప‌టికే ఐసీసీకి పంపించింది. ఆ షెడ్యూల్ ప్ర‌కారం.. ఫిబ్రవ‌రి 19 నుంచి మార్చి మార్చి 9 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కు లాహోర్‌లోని గఢాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలు ఆతిథ్య‌మివ్వ‌నున్నాయి. దీంతో ఇప్ప‌టికే ఆయా స్టేడియాల్లో పునర్నిర్మాణ ప‌నులు కూడా మొద‌లయ్యాయి  ఇందుకు కోసం పీసీబీ రూ. 1,280 కోట్లు కేటాయించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)