Breaking News

స్టార్‌ ఫుట్‌బాలర్‌ సంచలన నిర్ణయం

Published on Tue, 02/14/2023 - 15:08

చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌.. మిడ్‌పీల్డర్‌ జకుబ్‌ జాంట్కో తనను తాను 'గే'(Gay-స్వలింగ సంపర్కుడు)గా ప్రకటించుకున్నాడు. సోమవారం ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఎమోషనల్‌ అయ్యాడు. ''నేను హోమోసెక్సువల్‌.. ఈ విషయాన్ని ఇంకా దాచుకోవాలనుకోవడం లేదు. అందరిలాగే నేను కూడా నా జీవితాన్ని స్వేచ్ఛగా, భయం, పక్షపాతం లేకుండా ప్రేమతో జీవించాలనుకుంటున్నా. ఒక ఫుట్‌బాలర్‌గా నా కెరీర్‌లో ఇంకా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ప్రొఫెషనలిసమ్‌, అభిరుచితో వర్క్‌ చేయడానికి ఇష్టపడుతా.. ఎవరిపై ఆధారపడాల్సి అవసరం నాకు లేదు. ఒక స్వలింగ సంపర్కుడిగా నాకు నేను స్వేచ్ఛను ప్రకటించుకున్నా'' అంటూ పేర్కొన్నాడు.

ఇక ఫుట్‌బాల్‌లో కెరీర్‌లో కొనసాగుతూ తాము స్వలింగ సంపర్కులమని కొంతమంది ఆటగాళ్లు మాత్రమే ధైర్యంగా బయటకు చెప్పగలిగారు. 1990లో జస్టిన్‌ ఫషాను, 2021లో ఆస్ట్రేలియాకు చెందిన జోష్‌ కావల్లో, 2022లో ఇంగ్లీష్‌ ఫుట్‌బాలర్‌ జేక్‌ డేనియల్స్‌.. తాజాగా జకుబ్‌ జాంట్కో తనను తాను గేగా ప్రకటించుకున్నాడు. ఇక జాంట్కో చెక్‌రిపబ్లిక్‌ తరపున 45 మ్యాచ్‌లాడి నాలుగు గోల్స్‌ కొట్టాడు. సీరీ-ఎ క్లబ్‌లో ఉడినీస్‌, సంప్డోరియా క్లబ్‌ల‍కు ప్రాతినిధ్యం వహించాడు.

చదవండి: Viral: భారత క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)