పసికూనపై లంక బ్యాటర్ల ప్రతాపం.. భారీ స్కోర్‌, టాప్‌-4 బ్యాటర్లు..!

Published on Mon, 06/19/2023 - 16:43

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో భాగంగా ఇవాళ గ్రూప్‌-బి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. బులవాయో వేదికగా జరిగిన ఇవాల్టి తొలి మ్యాచ్‌లో యూఏఈ జట్టు శ్రీలంకను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి యూఏఈ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో టాప్‌-4 బ్యాటర్లంతా (నిస్సంక (57), కరుణరత్నే (52), కుశాల్‌ మెండిస్‌ (78), సమర విక్రమ (73)) హాఫ్‌ సెంచరీలు చేయగా.. ఐదో నంబర్‌ ఆటగాడు చరిత్‌ అసలంక (23 బంతుల్లో 48 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించి హాఫ్‌ సెంచరీకి 2 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

ఆఖర్లో హసరంగ (12 బంతుల్లో 23 నాటౌట్‌; 3 ఫోర్లు) కూడా ఓ చేయి వేయడంతో శ్రీలంక ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ షనక (1), ధనంజయ డిసిల్వ (5) మాత్రమే సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కు పరిమితమయ్యారు. 

యూఏఈ బౌలర్లలో అలీ నసీర్‌ 2 వికెట్లు పడగొట్టగా.. రోహన్‌ ముస్తఫా, అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌, బాసిల్‌ హమీద్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో 2 బెర్తుల కోసం విండీస్‌, శ్రీలంక,  జింబాబ్వే సహా మొత్తం 10 జట్లు వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విన్నర్‌, రన్నరప్‌లు భారత్‌, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌లతో వన్డే వరల్డ్‌కప్‌-2023లో పోటీపడతాయి.

గ్రూస్‌-ఏలో జింబాబ్వే, నేపాల్‌, వెస్టిండీస్‌, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌ జట్లు ఉండగా.. గ్రూప్‌-బిలో శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్‌, ఒమన్‌, స్కాట్లాండ్‌ జట్లు పోటీపడనున్నాయి.

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)