Breaking News

చెలరేగిన మ్యాక్స్‌ ఓడౌడ్‌, విన్నింగ్‌ రన్‌ కొట్టిన ఆంధ్ర క్రికెటర్‌.. నెదర్లాండ్స్‌కు మరో విజయం

Published on Sat, 06/24/2023 - 18:49

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో నెదర్లాండ్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. రెండ్రోజుల కిందట (జూన్‌ 22) యూఎస్‌ఏపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జూన్‌ 24) నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరపించింది. ఓపెనర్‌ మ్యాక్స్‌ ఓడౌడ్‌ (75 బంతుల్లో 90; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి నెదర్లాండ్స్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతనికి విక్రమ్‌జిత్‌ సింగ్‌ (30), బాస్‌ డి లీడ్‌ (41 నాటౌట్‌) సహకరించగా.. ఆంధ్ర క్రికెటర్‌ (విజయవాడలో పుట్టాడు) తేజ నిడమనూరు (2 నాటౌట్‌) నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

విజృంభించిన వాన్‌ బీక్‌.. కుప్పకూలిన నేపాల్‌
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌.. వాన్‌ బీక్‌ (9.3-1-24-4), బాస్‌ డి లీడ్‌ (2/31), విక్రమ్‌జిత్‌ సింగ్‌ (2/20), క్లేటన్‌ ఫ్లాయిడ్‌ (1/31), ఆర్యన్‌ దత్‌ (8-2-23-1) ధాటికి 44.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (33) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చెలరేగిన మ్యాక్స్‌ ఓడౌడ్‌..
168 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్‌ ఓపెనర్‌ మ్యాక్స్‌ ఓడౌడ్‌ (90) చెలరేగి ఆడాడు. ఓడౌడ్‌ దాదాపుగా ప్రతి నేపాల్‌ బౌలర్‌ను టార్గెట్‌ చేసి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. ఆఖర్లో బాస్‌ డి లీడ్‌ (39 బంతుల్లో 41 నాటౌట్‌; 6 ఫోర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా నెదర్లాండ్స్‌ కేవలం 27.1 ఓవర్లలో  వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్‌ బౌలర్లలో సందీప్‌ లామిచ్చెన్‌ 2, గుల్సన్‌ ఝా ఓ వికెట్‌ పడగొట్టారు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)