Breaking News

Trending Pic: విండీస్‌ యోధుడి ముఖం చినబోయిన వేళ..!

Published on Tue, 06/27/2023 - 11:55

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో నిన్న (జూన్‌ 26) జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో టూ టైమ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌పై పసికూన నెదర్లాండ్స్‌ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడిన విండీస్‌ సూపర్‌ సిక్స్‌కు చేరినప్పటికీ.. వరల్డ్‌కప్‌-2023కు అర్హత సాధించే అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసుకుంది. సూపర్‌ సిక్స్‌లో విండీస్‌ ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడ​ కష్టమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జింబాబ్వే, శ్రీలంకలకు వరల్డ్‌కప్‌ బెర్త్‌ దొరకడం ఖాయమని తెలుస్తుంది. 

కాగా, నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమి అనంతరం యావత్‌ వెస్టిండీస్‌ బృందంలో బాధ కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ కార్ల్‌ హూపర్‌తో పాటు ఆటగాళ్లంతా దాదాపుగా కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన మాకు ఇదేం గతి అన్నట్లు వారు వ్యవహరించారు. వీరందరి బాధ కంటే ఓ విండీస్‌ యోధుడి ముఖంలో కనిపించిన నిరాశ, నిర్వేదం చూపరులకు చాలా బాధ కలిగించింది.

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు ప్రజంటేషన్‌ సందర్భంగా విండీస్‌ మాజీ ప్లేయర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ముఖంలో కనిపించిన ఎక్స్‌ప్రెషన్‌.. యావత్‌ విండీస్‌ అభిమానుల బాధను ప్రతిబింబించింది. లోగాన్‌ వాన్‌ బీక్‌కు అవార్డు బహుకరిస్తున్న సమయంలో బ్రాత్‌వైట్‌ ముఖం చాలా చిన్నబోయినట్లు కనిపించింది. అతని ముఖం విండీస్‌ ఓటమి తాలూక బాధ కొట్టొచ్చినట్లు కనపడింది.

ఈ పిక్‌ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పిక్‌ చూసి క్రికెట్‌ అభిమానులు విండీస్‌పై జాలి చూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టుకు ఈ దుస్థితి ఏంటని బాధపడుతున్నారు. కాగా, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ 2016లో విండీస్‌ రెండో సారి టీ20 వరల్డ్‌కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో బ్రాత్‌వైట్‌.. బెన్‌ స్టోక్స్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది విండీస్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు.  

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)