జింబాబ్వే చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న వెస్టిండీస్‌కు మరో బిగ్‌ షాక్‌

Published on Sun, 06/25/2023 - 14:48

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో నిన్న (జూన్‌ 24) పెను సంచలనం నమోదైంది. రెండు సార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను పసికూన జింబాబ్వే మట్టికరిపించింది. ఈ ఓటమితో విండీస్‌ వన్డే వరల్డ్‌కప్‌ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ భారీ పరాభవం నుంచి తేరుకోకముందే విండీస్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గాను ఆ జట్టు మ్యాచ్‌ ఫీజ్‌లో 60 శాతం కోత పడింది. నిర్ణీత సమయంలో విండీస్‌ బౌలర్లు 3 ఓవర్లు తక్కువ వేసినందున ఓవర్‌కు 20 శాతం చొప్పున ప్రతి ఆటగాడి మ్యాచ్‌ ఫీజ్‌లో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ వెల్లడించింది. 

కాగా, నిన్నటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌.. జింబాబ్వే చేతిలో ఓడినప్పటికీ సూపర్‌ సిక్స్‌ దశకు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ కోల్పోవడంలో లాసైన 2 పాయింట్లు విండీస్‌కు తదుపరి దశలో అత్యంత కీలకంగా మారతాయి. అవి విండీస్‌ వరల్డ్‌కప్‌ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఓటమితో విండీస్‌ కలవరపడుతుంది. 

ఇదిలా ఉంటే, గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో జింబాబ్వే.. తమకంటే ఎన్నో రెట్లు పటిష్టమైన వెస్టిండీస్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. సికందర్‌ రజా (68, 2/45) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో, టెండాయ్‌ చటార (3/52), బ్లెస్సింగ్‌ ముజరబాని (2/33), రిచర్డ్‌ నగరవ (2/25) అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్‌ కాగా, విండీస్‌ 44.4 ఓవర్లలో 233 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. గ్రూప్‌-ఏ నుంచి వెస్టిండీస్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్‌ సూపర్‌ సిక్స్‌ దశకు అర్హత సాధించాయి. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్‌, ఒమన్‌ దేశాలు సూపర్‌ సిక్స్‌ దశకు చేరే అవకాశం ఉంది.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)