శ్రీలంకకు ధీటుగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన స్కాట్లాండ్‌

Published on Sun, 06/25/2023 - 20:53

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో గ్రూప్‌-బిలో శ్రీలంకకు ధీటుగా చిన్న జట్టు స్కాట్లాండ్‌ వరుస విజయాలు సాధిస్తుంది. ఇవాళ (జూన్‌ 25) ఒమన్‌పై విజయం సాధించడంతో ఆ జట్టు శ్రీలంక తరహాలో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. తద్వారా గ్రూప్‌-బి నుంచి శ్రీలంక తర్వాత సూపర్‌ సిక్స్‌కు చేరుకున్న రెండో జట్టుగా నిలిచింది.

ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి చవిచూసిన ఐర్లాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. స్కాట్లాండ్‌ చేతిలో ఓడినా ఒమన్‌ ఈ గ్రూప్‌ నుంచి మూడో జట్టుగా సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్‌-బిలో మరో జట్టైన యూఏఈ 3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలతో ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గ్రూప్‌-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్‌, వెస్టిండీస్‌ జట్లు సూపర్‌ సిక్స్‌ దశకు చేరగా.. నేపాల్‌, యూఎస్‌ఏ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీసింది. ఫలితంగా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (136) సూపర్‌ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్‌ రిచీ బెర్రింగ్టన్‌ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్‌ బౌలర్లలో బిలాల్‌ ఖాన్‌ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్‌ బట్‌ 2, జే ఒడేడ్రా ఓ వికెట్‌ పడగొట్టారు.    

321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్‌.. ఏ దశలోనూ విజయం సాధించేట్టు కనపడలేదు. ఆ జట్టు తొలి 6 వికెట్లు క్రమ అంతరాల్లో పోగొట్టుకుంది. అయితే వికెట్‌ కీపర్‌ నసీం ఖుషీ (63) ఒమన్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖర్లో స్కాట్లాండ్‌ బౌలర్‌ క్రిస్‌ గ్రీవ్స్‌ చెలరేగి 5 వికెట్లు పడగొట్టడంతో ఒమన్‌ కథ ముగిసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)