Breaking News

CWC 2023: ఆఫ్ఘనిస్తాన్‌ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచిన శ్రీలంక

Published on Mon, 10/30/2023 - 18:00

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా పూణే వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 30) జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 22 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక, ఆతర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లు భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేయడంలో ఆఫ్ఘన్‌ బౌలర్లు సఫలమయ్యారు.

ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక (46), కుశాల్‌ మెండిస్‌ (39), సమరవిక్రమ (36) మంచి ఆరంభాలు లభించినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తీక్షణ​ (29), ఏంజెలో మాథ్యూస్‌ (23), అసలంక (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. దిముత్‌ కరుణరత్నే (15), ధనంజయం డిసిల్వ (14), చమీర (1), రజిత (5) నిరాశపరిచారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో ఫజల్‌ హక్‌ ఫారూఖీ 4, ముజీబ్‌ రెహ్మాన్‌ 2, రషీద్‌ ఖాన్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఆఫ్ఘనిస్తాన్‌: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌కీపర్‌), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్‌ హాక్ ఫారూఖీ

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)