Breaking News

CWC 2023: ఆసీస్‌ చేతిలో ఓటమి.. చెత్త రికార్డును సమం చేసిన శ్రీలంక

Published on Tue, 10/17/2023 - 07:42

వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక చెత్త రికార్డును సమం చేసింది. ఆసీస్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందడంతో ప్రపంచకప్‌లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా రికార్డుల్లోకె​క్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ చెత్త రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. తాజా ఓటమితో శ్రీలంక.. జింబాబ్వే సరసన చేరింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో చెరి 42 అపజయాలతో చెత్త రికార్డును పంచుకున్నాయి. ఆతర్వాతి స్ఠానంలో వెస్టిండీస్‌ ఉంది. ఈ జట్టు 35 పరాజయాలతో మూడో స్థానంలో నిలిచింది. విండీస్‌ తర్వాత 34 పరాజయాలతో ఇంగ్లండ్‌ నాలుగో స్థానంలో ఉంది.  

ఇదిలా ఉంటే, లక్నో వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (61), కుశాల్‌ పెరీరా (78) మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. అసలంక (25) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఈ ముగ్గురు మినహా లంక ఇన్నింగ్స్‌లో కనీసం రెండంకెల స్కోర్‌ చేసిన ఆటగాడు కూడా లేడు. ఆసీస్‌ బౌలరల్లో ఆడమ్‌ జంపా (8-1-47-4) లంకను దారుణంగా దెబ్బకొట్టాడు. స్టార్క్‌, కమిన్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. మిచెల్‌ మార్ష్‌ (52), జోష్‌ ఇంగ్లిస్‌ (58), లబూషేన్‌ (40), మ్యాక్స్‌వెల్‌ (31 నాటౌట్‌), స్టోయినిస్‌ (20 నాటౌట్‌) రాణించడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. డేవిడ్‌ వార్నర్‌ (11), స్టీవ్‌ స్మిత్‌ (0) నిరాశపరిచారు. లంక బౌలర్లలో దిల్షన్‌ మధుషంక 3 వికెట్లు పడగొట్టగా.. దునిత్‌ వెల్లలగే ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఇది మొదటి గెలుపు కాగా.. శ్రీలంకకు ఇది హ్యాట్రిక్‌ ఓటమి.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)