Breaking News

CWC 2023: సెమీస్‌కు సౌతాఫ్రికా.. ఇంగ్లండ్‌ ఇంటికి.. మూడు జట్ల మధ్య తీవ్ర పోటీ

Published on Sun, 11/05/2023 - 08:30

వన్డే వరల్డ్‌కప్‌ 2023 చివరి అంకానికి చేరుకుంది. నిన్నటితో రెండు సెమీస్‌ బెర్త్‌లు, టోర్నీ నుంచి నిష్క్రమించే రెండు జట్ల పేర్లు ఖరారయ్యాయి. ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్‌ రెండు రోజుల కిందటే సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. నిన్న పాక్‌ చేతిలో న్యూజిలాండ్‌ ఓడటంతో సౌతాఫ్రికా ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. 

ఈ ఎడిషన్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు బంగ్లాదేశ్‌ కాగా.. నిన్నటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో ఇంగ్లండ్‌ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ ఇరు జట్లు ఏడు మ్యాచ్‌ల్లో చెరి 6 పరాజయాలు మూటగట్టుకుని టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యాయి. వీటిలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన ఇంగ్లండ్‌ పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. ఈ జట్టు వరుసగా ఐదు పరాజయాలు మూటగట్టుకుని అవమానకర రీతిలో సెమీస్‌కు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

పోటీలో నాలుగు జట్లు..
ప్రస్తుతం మిగిలిన రెండు సెమీస్‌ బెర్త్‌ల కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో ఆస్ట్రేలియా మూడో బెర్త్‌ను (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) దాదాపుగా ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.  

న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరాలంటే..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 0.398) ఉన్న కివీస్‌ సెమీస్‌కు చేరాలంటే వారు తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (శ్రీలంక) భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. 

కీలకపాత్ర పోషించనున్న నెట్‌ రన్‌రేట్‌..
ప్రస్తుతం 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన​ పాక్‌ సెమీస్‌కు చేరాలంటే వారు తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (ఇంగ్లండ్‌) భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. 

పాక్‌, న్యూజిలాండ్‌లు తదుపరి మ్యాచ్‌ల్లో తమతమ ప్రత్యర్దులపై విజయాలు సాధిస్తే సమాన పాయింట్లు (10) కలిగి ఉంటాయి. ఇక్కడ నెట్‌ రన్‌రేట్‌ కీలకపాత్ర పోషిస్తుంది. రెండు జట్లలో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. 

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఓడించాలి..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌కు చేరాలంటే వారు తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఓడించాల్సి ఉంటుంది. ఈ జట్టు రెంటిలో ఒకటి ఓడినా సెమీస్‌ అవకాశాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్‌ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫైనల్‌ ఫోర్‌కు చేరుకుంటుంది. అయితే పటిష్టమైన ఆసీస్‌, సౌతాఫ్రికాలను ఓడించడం ఆఫ్ఘనిస్తాన్‌కు అంత సులువు కాదు.

Videos

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

జైలర్ 2 పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్ వైరల్

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)