Breaking News

CWC 2023: ఇంగ్లండ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏదో జరుగుతుంది..!

Published on Mon, 10/30/2023 - 15:49

ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుస పరాజయాలు (6 మ్యాచ​్‌ల్లో 5 అపజయాలు) ఎదుర్కొంటూ ఘోర నిష్క్రమణ దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్‌ జట్టుపై ఆ దేశ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత కామెంటేటర్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగి, ఇంత పేలవ ప్రదర్శన కనబర్చిన జట్టును నేనెప్పుడూ చూడలేదని ప్రస్తుత ఇంగ్లండ్‌ జట్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఏదో అస్థిరత స్పష్టంగా కనిపిస్తుంది.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏదో జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశాడు.

గెలుపు కోసం జట్టు అవలంబిస్తున్న పద్ధతి, మ్యాచ్‌లను వారు కోల్పోయిన తీరు చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతుందని బాంబు పేల్చాడు. 2019లో ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ అందించి, ఆ దేశ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మోర్గాన్‌, సొంత జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

మోర్గాన్‌ చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలీదు కానీ, అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రస్తుత ఇంగ్లండ్‌ జట్టు సభ్యుడు లివింగ్‌స్టోన్‌ స్పందించాడు. జట్టు సభ్యులందరికీ మోర్గాన్‌పై అమితమైన గౌరవం ఉంది. అతను ఈ తరహా వ్యాఖ్యలు చేసి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. గుండెల పై చెయ్యి వేసుకుని చెప్పగలను అతను అన్న విధంగా జట్టులో ఎలాంటి మనస్పర్థలు లేవు. మోర్గాన్‌ ఊహించిన విధంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏమీ జరగడం లేదు. జట్టులో అందరం​ కలిసికట్టుగా ఉన్నాం. ప్రతి మ్యాచ్‌లో వంద శాతం విజయాల కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే మాకేదీ కలిసి రావడం లేదంటూ మోర్గాన్‌ వ్యాఖ్యలకు కౌంటరిచ్చాడు.

ఇదిలా ఉంటే, టీమిండియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్వల్ప లక్ష్యాన్ని (230) కూడా చేధించలేక 100 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో కేవలం బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలుపొందిన ఆ జట్టు.. న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, భారత్‌ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.

బట్లర్‌ సేన తదుపరి జరిగే 3 మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌, పాకిస్తాన్‌) రెండు మ్యాచ్‌ల్లో ఒడినా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాటు ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా అర్హత కోల్పోతుంది. కాగా, ప్రపంచకప్‌లో లీగ్‌ దశ తర్వాత టాప్‌-7లో నిలిచే జట్లు 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)