Breaking News

మాథ్యూస్‌ టైమ్‌ ఔట్‌.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్‌

Published on Tue, 11/07/2023 - 09:37

ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్‌ ఔట్‌గా ప్రకటించే విషయంలో క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని విమర్శలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ ఈ విషయమై మ్యాచ్‌ అనంతరం స్పందించాడు. మాథ్యూస్‌ టైమ్‌ ఔట్‌ కోసం అప్పీల్‌ చేసినందుకు నాకు ఎలాంటి బాధలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. 

మా ఫీల్డర్‌లలో ఒకరు నా దగ్గరకు వచ్చి అప్పీల్ చేస్తే మాథ్యూస్‌ ఔట్ అవుతాడని తెలిపాడు. అలాగే చేశాను. అంపైర్లు నేను సీరియస్‌గా అప్పీల్‌ చేస్తున్నానా లేదా అని అడిగారు. అవునని చెప్పాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. రూల్స్‌లో  ఉంది కాబట్టి అప్పీల్‌ చేశాను.

యుద్ధంలో ఉన్నప్పుడు జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సి వస్తుంది. అందుకు నేనెప్పుడూ సిద్దంగా ఉంటాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనంటూ కామెంట్స్‌ చేశాడు. పైగా మాథ్యూస్‌తో వాగ్వాదం తమ గెలుపుకు కలిసొచ్చిందని అన్నాడు. 

కాగా, వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి టైమ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించి అందరి చీత్కారాలకు గురవుతున్నాడు. మాథ్యూస్‌ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయనప్పటికీ షకీబ్‌ కనీస క్రీడా ధర్మాన్ని మరిచి ప్రవర్తించడం క్రికెట్‌ అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

చదవండి: మాథ్యూస్‌ 'టైమ్డ్ ఔట్'.. క్లారిటీ ఇచ్చిన అంపైర్‌

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు