Breaking News

CWC 2023: శ్రీలంక-సౌతాఫ్రికా మ్యాచ్‌.. రికార్డులు బద్దలు

Published on Sun, 10/08/2023 - 07:25

2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-సౌతాఫ్రికా జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో పలు ప్రపంచకప్‌ రికార్డులు బద్దలయ్యాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేస్తూ వరల్డ్‌కప్‌ హయ్యెస్ట్‌ టీమ్‌ స్కోర్‌ (428) నమోదు చేసింది. దీంతో పాటు వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు చేయడం (వాన్‌ డర్‌ డసెన్‌ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్‌ డి కాక్‌ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు)) లాంటి అత్యంత అరుదైన రికార్డు కూడా ఈ మ్యాచ్‌లోనే నమోదైంది.

అలాగే ఈ మ్యాచ్‌లో సుడిగాలి వేగంతో శతక్కొట్టిన ఎయిడెన్‌ మార్క్రమ్‌.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (49 బంతుల్లో) రికార్డును నమోదు చేశాడు. ఈ మూడు రికార్డులతో పాటు ఈ మ్యాచ్‌లో మరో వరల్డ్‌కప్‌ రికార్డు కూడా నమోదైంది. 429 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా 102 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. లంక ఇన్నింగ్స్‌లో చరిత్‌ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్‌ మెండిస్‌ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), దసున్‌ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.

భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక.. సౌతాఫ్రికాకు అంత సునయాసంగా విజయాన్ని దక్కనీయలేదు. లంకేయులు ఓడిపోతామని తెలిసి, ఎదురుదాడి చేశారు. వికెట్లు ఉండి ఉంటే వారు కూడా 400 మార్కును రీచ్‌ అయ్యేవారు. లంకన్లు సైతం భారీ స్కోర్‌ చేయడంతో ఈ మ్యాచ్‌లో వరల్డ్‌కప్‌ హైయెస్ట్‌ మ్యాచ్‌ స్కోర్‌ రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌లో సఫారీలు, లంకేయులు కలిపి 754 పరుగులు చేశారు. ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇదే అత్యధిక మ్యాచ్‌ స్కోర్‌. 2019లో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 714 పరుగులు చేశాయి. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక మ్యాచ్‌ స్కోర్‌గా చలామణి అయ్యింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)