అత్యుత్తమ ప్రదర్శన కాదు.. ఒత్తిడిలో ఉన్నాం.. రాత్రికిరాత్రి చెత్త టీమ్‌ అయిపోదు..!

Published on Thu, 11/02/2023 - 09:22

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో న్యూజిలాండ్‌ 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో కివీస్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జరిగే రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో ఏ మ్యాచ్‌లో ఓడినా కివీస్‌ సెమీస్‌ అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉంది. 

సౌతాఫ్రికా చేతిలో ఓటమి అనంతరం కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ స్పందిస్తూ.. ఈ మ్యాచ్‌లో మేం స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన కాదు. డికాక్‌, డస్సెన్‌ల భాగస్వామ్యం తర్వాత ఒత్తిడిలో పడ్డాం. వారు మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. మా బౌలర్లు ప్రత్యర్ధిని 330 పరుగుల్లోపు పరిమితం చేయాల్సి ఉండింది. అలా చేయడంలో మేం విఫలమయ్యాం.

గ్రౌండ్‌ చాలా చిన్నగా, బ్యాటింగ్‌కు అనుకువగా ఉండింది. అయితే మేము పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయాం. మొదటి 10 ఓవర్లలో (పవర్‌ప్లే) పెద్దగా ఏమీ చేయలేకపోయాం. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమయ్యాం. ప్రత్యర్ధి తమను తాము గొప్ప స్థితిలో ఉంచుకుంది. ఏ సందర్భంలోనూ వారు మ్యాచ్‌పై పట్టు కోల్పోలేదు. గాయాలు మా జట్టుకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఈ ఓటమిని ఇక్కడితో వదిలేసి, తదుపరి పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌పై దృష్టి సారిస్తాం. రాత్రికిరాత్రి మేం చెడ్డ జట్టుగా మారిపోమని అనుకుంటున్నానని అన్నాడు. 

కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. డికాక్‌ (114), డస్సెన్‌ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌.. కేశవ్‌ మహారాజ్‌ (4/46), మార్కో జన్సెన్‌ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (60), విల్‌ యంగ్‌ (33), డారిల్‌ మిచెల్‌ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)