Breaking News

హ్యాట్రిక్‌ ఓటములతో ఢీలా పడిన న్యూజిలాండ్‌.. మరో పిడుగు లాంటి వార్త

Published on Thu, 11/02/2023 - 08:05

ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నాలుగు వరుస విజయాల తర్వాత హ్యాట్రిక్‌ పరాజయాలు ఎదుర్కొన్న న్యూజిలాండ్‌ ఒక్కసారిగా సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికాతో నిన్న (నవంబర్‌ 1) జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన కివీస్‌ రన్‌రేట్‌ పరంగానూ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. ఇవి చాలవన్నట్లు ఆ జట్టులో గాయాల సమస్య మరింత తీవ్రతరమైంది. సౌతాఫ్రికాతో సందర్భంగా ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ హ్యామ్‌స్ట్రింగ్‌ ఇంజ్యూరీకి గురై ఓవర్‌ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. జట్టు ఓటమి మార్జిన్‌ను తగ్గించేందుకు అతను ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగినప్పటికీ.. గాయం తాలూకా వేదన అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.

హెన్రీ గాయం తీవ్రతపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేనప్పటికీ.. అతను కనీసం ఒకటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న కివీస్‌కు హెన్రీ గాయం విషయం అస్సలు మింగుడుపడటం లేదు.  గాయాల కారణంగా ఇప్పటికే కేన్‌ విలియమ్సన్‌, లోకీ ఫెర్గూసన్‌, మార్క్‌ చాప్‌మన్‌ సేవలు కోల్పోయిన కివీస్‌.. తాజాగా మ్యాట్‌ హెన్రీ సేవలు కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది.

సెమీస్‌ రేసులో నిలవాలంటే కివీస్‌ మున్ముందు అత్యంత కీలకమైన మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయాల బారిన పడుతుండటం ఆ జట్టుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సౌతాఫ్రికా మ్యాచ్‌ సందర్భంగా హెన్రీతో పాటు జిమ్మీ నీషమ్‌ కూడా గాయపడినట్లు సమాచారం. నీషమ్‌ కుడి చేతి మణికట్టుకు గాయమైనట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమై, అతను తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోతే కివీస్‌ సెమీస్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. 

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. డికాక్‌ (114), డస్సెన్‌ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌.. కేశవ్‌ మహారాజ్‌ (4/46), మార్కో జన్సెన్‌ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)