Breaking News

CWC 2023: శ్రేయస్‌-రాహుల్‌.. జోడీ నంబర్‌ వన్‌

Published on Mon, 11/13/2023 - 09:28

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో విజృంభించి నెదర్లాండ్స్‌ను 160 పరుగుల భారీ తేడాతో ఓడించారు. భారత గెలుపులో రాహుల్‌, శ్రేయస్‌ ప్రధానపాత్ర పోషించారు.

ఈ జోడీ నాలుగో వికెట్‌కు అభేద్యమైన 208 పరుగుల భాగస్వామ్యం​ నమోదు చేసి టీమిండియా భారీ స్కోర్‌ చేయడానికి దోహదపడింది. ఈ క్రమంలో రాహుల్‌-శ్రేయస్‌ జోడీ వరల్డ్‌కప్‌ రికార్డు నెలక్పొంది. వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున నాలుగు అంతకంటే తక్కువ వికెట్లకు నమోదైన భాగస్వామ్యాల్లో ఇదే అత్యుత్తమంగా నిలిచింది. దీనికి ముం​దు 2015 వరల్డ్‌కప్‌లో ధోని, రైనా జోడీ జింబాబ్వేపై నెలకొల్పిన అజేయ 196 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమంగా ఉండింది. 

ఇదే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌పై విరాట్‌-రాహుల్‌ జోడీ నెలకొల్పిన 165 పరుగుల భాగస్వామ్యం ఈ విభాగంలో మూడో అత్యుత్తమంగా ఉంది. ఆతర్వాత 1996 వరల్డ్‌కప్‌లో కాంబ్లీ-సిద్దూ నెలకొల్పిన 142 పరుగుల భాగస్వామ్యం.. 1999 వరల్డ్‌కప్‌లో అజయ్‌ జడేజా, రాబిన్‌ సింగ్‌ నెలకొల్పిన 141 పరుగుల భాగస్వామ్యం వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.  మొత్తంగా నెదర్లాండ్స్‌పై కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి దోహదపడిన రాహుల్‌-శ్రేయస్‌ జోడీ నంబర్‌ వన్‌ జోడీ అనిపించుకుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)