Virat Kohli: కలిస్‌ను దాటేశాడు.. ఇక మిగిలింది ముగ్గురే..!

Published on Fri, 10/20/2023 - 09:28

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి మరో ఆల్‌టైమ్‌ రికార్డుకు చేరువవుతున్నాడు. బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన అతను.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు 50 ప్లస్‌ స్కోర్లు (212) చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో కోహ్లి సౌతాఫ్రికా లెజెండ్‌ జాక్‌ కలిస్‌ (211) రికార్డును అధిగమించాడు.

ఈ జాబితాలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ (264) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (217), శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (216) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో కోహ్లి మరో 53 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేస్తే సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డును అధిగమిస్తాడు.

ఇదిలా ఉంటే, నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్‌ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్‌ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్‌ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.

కోహ్లి ఖాతాలో మరిన్ని రికార్డులు..
ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన కోహ్లి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 48వ సెంచరీని, ఓవరాల్‌గా (అంతర్జాతీయ క్రికెట్‌ మొత్తంలో) 78వ సెంచరీని నమోదు చేసిన కోహ్లి.. తాజాగా చేసిన 103 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్‌లో 26000 పరుగుల మైలురాయిని  (26026 పరుగులు) దాటాడు. గతంలో ఈ మైలురాయిని సచిన్‌ (34357), సంగక్కర (28016), పాంటింగ్‌ (27483) మాత్రమే దాటారు.

26000 పరుగుల మార్కును చేరుకునే క్రమంలో కోహ్లి.. జయవర్ధనేను (25957) అధిగమించాడు. 26000 పరుగుల మైలురాయిని కోహ్లి అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (567) చేరుకోవడం  విశేషం. కొద్ది రోజుల కిందట కోహ్లి అత్యంత వేగంగా 25000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)