CWC 2023: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌.. అరుదైన రికార్డు

Published on Fri, 11/17/2023 - 07:46

వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తుది సమరం జరుగనుంది. నిన్న (నవంబర్‌ 16) సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు భారత్‌.. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది.

కాగా, వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్‌ జరగడం ఇది నాలుగో సారి. 1996, 2007 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా.. ఆస్ట్రేలియా–భారత్‌ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్‌ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్‌ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.  

ఇదిలా ఉంటే, కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో గెలవడం ద్వారా ఆస్ట్రేలియా ఎనిమిదో సారి వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు చేరింది. ఈ జట్టు 1975 (రన్నరప్‌), 1987 (విజేత), 1996 (రన్నరప్‌), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో  టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఇందులో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్‌ తో సంతృప్తి పడింది.

సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు ఐదోసారి సెమీస్‌ గండాన్ని గట్టెక్కలేకపోయింది. సఫారీలు తొలిసారి 1992 సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోగా... 1999, 2007, 2023 ఎడిషన్లలో ఆ్రస్టేలియా చేతిలో, 2015లో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)