CWC 2023 ENG VS NZ: 4658 వన్డేల చరిత్రలో తొలిసారి ఇలా..!

Published on Thu, 10/05/2023 - 18:54

భారత్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఇంగ్లండ్‌ జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో  న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తుది జట్టులోని సభ్యులందరూ (11 మంది) రెండంకెల స్కోర్లు చేసి చరిత్ర సృష్టించారు. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ జట్టు సభ్యులు జానీ బెయిర్‌స్టో (33), డేవిడ్‌ మలాన్‌ (14), హ్యారీ బ్రూక్‌ (25), మొయిన్‌ అలీ (11), జోస్‌ బట్లర్‌ (43), జో రూట్‌ (77), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (20), సామ్‌ కర్రన్‌ (14), క్రిస్‌ వోక్స్‌ (11), మార్క్‌ వుడ్‌ (13 నాటౌట్‌), ఆదిల్‌ రషీద్‌ (15 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. 

ఈ మ్యాచ్‌లో కివీస్‌ బౌలర్లు రాణించినప్పటికీ జట్టులోని సభ్యులందరూ తలో చేయి వేయడంతో ఇంగ్లండ్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 3, సాంట్నర్‌, ఫిలిప్స్‌ తలో 2, బౌల్ట్‌, రవీంద్ర చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ ఏడో బంతికే వికెట్‌ కోల్పోయినప్పటికీ.. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్‌ రవీంద్ర (39), డెవాన్‌ కాన్వే (33) ధాటిగా ఆడుతూ తమ జట్టును లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. 9 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 73/1గా ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)