Breaking News

కోహ్లి డ్రాప్‌ క్యాచ్‌పై స్పందించిన కమిన్స్‌.. మరో 50 పరుగులు చేసుంటే..! 

Published on Mon, 10/09/2023 - 09:51

చెన్నై వేదికగా టీమిండియాతో నిన్న జరిగిన వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్లిష్టమైన దశ నుంచి అద్భుతంగా పురోగమనం సాధించి, ఆసీస్‌ నిర్ధేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను విరాట్‌ కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (115 బంతుల్లో 97 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి గట్టెక్కించారు. ఫలితంగా భారత్‌ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది.

కోహ్లి క్యాచ్‌ను జారవిడిచిన మార్ష్‌..
ఓ దశలో భారత్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడింది. జట్టు స్కోర్‌ 20 పరుగుల వద్ద ఉండగా హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌ కోహ్లి క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ లైఫ్‌ అనంతరం వెనుదిరిగి చూసుకోని కోహ్లి భారత్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. ఓ రకంగా చెప్పాలంటే కోహ్లి డ్రాప్‌ క్యాచే ఆసీస్‌ కొంపముంచింది. అయితే ఈ విషయాన్ని కమిన్స్‌ అంగీకరించలేదు.

కోహ్లి క్యాచ్‌ డ్రాప్‌.. అప్పుడే మర్చిపోయా..!
మ్యాచ్‌ అనంతరం ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా కమిన్స్‌ మాట్లాడుతూ.. మార్ష్‌ కోహ్లి క్యాచ్‌ డ్రాప్‌ చేసిన విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. క్రికెట్‌లో ఇది సర్వసాధారణం. అయితే స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఏ జట్టుకైనా 10/4 స్కోర్‌ డ్రీమ్‌ స్టార్ట్‌ అని చెప్పాలి. మేము ఆ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నాం. అయినా మా ఓటమికి ఇది కారణం కాదు.

మేము అదనంగా మరో 50 పరుగులు చేసి ఉండాల్సింది. ఇలాంటి టఫ్‌ పిచ్‌పై 200 స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకోవడం చాలా కష్టం. క్రెడిట్‌ భారత స్పిన్నర్లకే. వారు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఓడిపోయినందుకు బాధ లేదు. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. రోహిత్‌ గెలిచి ఉన్నా ఇదే పని చేసేవాడు అని  అన్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)