CWC 2023: ఇంగ్లండ్‌ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్‌

Published on Wed, 10/11/2023 - 11:59

ధర్మశాలలో నిన్న ఇంగ్లండ్‌ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఆ జట్టు మ్యాచ్‌ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధించారు. నిర్ధేశిత సమయం పూర్తియ్యే సరికి బంగ్లాదేశ్‌ తమ కోటా ఓవర్ల కంటే ఓ ఓవర్‌ వెనుపడి ఉండటంతో ఐసీసీ ఈ ఫైన్‌ విధించింది. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఆర్టికల్‌ 2.22 ప్రకారం బంగ్లాదేశ్‌ సభ్యులందరికీ ఈ ఫైన్‌ వర్తిస్తుంది. ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు ఎహసాన్‌ రజా, పాల్‌ విల్సన్‌, థర్డ్‌ అంపైర్‌ అడ్రియన్‌ హోల్డ్‌స్టాక్‌, ఫోర్త్‌ అంపైర్‌ కుమార ధర్మసేన బంగ్లాదేశ్‌ ఆటగాళ్లపై ఛార్జ్‌ తీసుకున్నారు. ఐసీసీ విధించిన ఈ జరిమానాను బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అంగీకరించాడు. దీంతో ఐసీసీ ప్యానెల్‌ ముందు హాజరుకు అతనికి మినహాయింపు లభించింది. 

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 137 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. డేవిడ్‌ మలాన్‌ (140) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ 48.2 ఓవర్లలో 227 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. రీస్‌ టాప్లే (10-1-43-4) బంగ్లా పతనాన్ని శాశించాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్‌ దాస్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్తాన్‌ చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్‌ మరో పది బంతులు మిగిలుండగానే ఛేదించి, ప్రపంచకప్‌లో 300 అంతకంటే ఎక్కువ టార్గెట్‌ను ఛేదించిన తొలి జట్టుగా రికార్డుల్లోకెక్కింది.

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)