389 పరుగుల భారీ లక్ష్యం.. నరాలు తెగే ఉత్కంఠ.. పోరాడి ఓడిన న్యూజిలాండ్‌

Published on Sat, 10/28/2023 - 18:46

ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 28) జరిగిన రసవత్తర సమరంలో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతి వరకు  సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. 389 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఆసీస్‌కు ఓటమిని పరిచయం చేసి పరాజయంపాలయ్యారు.

కివీస్‌ ఆటగాళ్లు రచిన్‌ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో జేమ్స్‌ నీషమ్‌ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా నీషమ్‌ తన జట్టును గెలిపించేందుకు చివరి నిమిషం వరకు పోరాడి విఫలమయ్యాడు. ఆఖరి 2 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన తరుణంలో నీషమ్‌ లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. అయినా కివీస్‌ గెలిచేందుకు చివరి బంతికి కూడా అవకాశం ఉండింది.

ఆఖరి బంతికి ఫెర్గూసన్‌ సిక్సర్‌ బాది ఉంటే న్యూజిలాండ్‌ సంచలన విజయం సాధించి ఉండేది. చివరి బంతిని స్టార్క్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ ఓటమి ఖరారైంది. న్యూజిలాండ్‌ వీరోచిత పోరాటం​ ముగిసింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కివీస్‌ విజయం సాధించి ఉంటే, ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఛేదనగా మిగిలిపోయి ఉండేది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో రచిన్‌, నీషమ్‌తో పాటు డారిల్‌ మిచెల్‌ (54) కూడా రాణించాడు. ఆసీస్‌ బౌలర్లలో జంపా 3, హాజిల్‌వుడ్‌, కమిన్స్‌ తలో 2, మ్యాక్స్‌వెల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. డేవిడ్‌ వార్నర్‌ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్‌ హెడ్‌ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్‌ ఇంగ్లిస్‌ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్‌), పాట్‌ కమిన్స్‌ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)