CWC 2023: మాక్సీ డబుల్‌ సెంచరీని కపిల్‌ 175తో పోల్చగలమా..?

Published on Wed, 11/08/2023 - 13:15

క్రికెట్‌లో పోలికలు అనేవి చాలా సహజం. ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనను గతంలో నమోదైన సమాన ప్రదర్శనలతో పోల్చడం సర్వ సాధారణం. ఇక్కడ ఓ ప్రదర్శనను తక్కువ చేసి, మరో దాన్ని ఎక్కువ చేసి చూపించాలని ఎవరూ అనుకోరు. కానీ, ఏ ప్రదర్శన జట్టు విజయానికి ఎక్కువగా దోహదపడిందని విశ్లేషించడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. ఇలాంటి ఓ పోలికనే ఇప్పుడు మనం చూడబోతున్నాం.

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఓటమి కొరల్లో ఉన్న తన జట్టును విధ్వంసకర డబుల్‌ సెంచరీతో (128 బంతుల్లో 201 నాటౌట్‌; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) గెలిపించాడు. 1983 ప్రపంచకప్‌లోనూ ఇలాంటి ఓ మెరుపు ఇన్నింగ్స్‌ను మనం చూశాం.

నాడు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు, నాటి జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 175 పరుగులు చేశాడు. కపిల్‌ ఆడిన ఈ సుడిగాలి ఇన్నింగ్స్‌ కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్‌ అభిమానుల మదిలో అలాగే ఉండిపోయింది. 

తాజాగా మాక్సీ మెరుపు ఇన్నింగ్స్‌ చూశాక చాలా మంది అభిమానులు నాటి కపిల్‌ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కొందరేమో మాక్సీ డబుల్‌ను కపిల్‌ 175తో పోలుస్తున్నారు. ఈ విషయంపై సోషల్‌మీడియా వేదికగా చర్చలు జరుపుతున్నారు. వాస్తవానికి ఈ రెండు ఇన్నింగ్స్‌ల మధ్య పోలిక పెట్టి, ఏది గొప్ప అని నిర్ణయించడానికి ఆస్కారమే లేదు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో దేని ప్రత్యేకత దానికి ఉంది. ఇక్కడ అభిమానులు తమ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పగలరు. అది తక్కువ, ఇది ఎక్కువ అని తేల్చడానికి వీలు లేదు.

రెండు సందర్భాల్లో ఆటగాళ్లు జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు. నాడు కపిల్‌ బరిలోకి దిగిన సందర్భంలో భారత్‌ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండింది. ఆ సమయంలో కపిల్‌ ఎదురుదాడికి దిగి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. తాజాగా మ్యాక్స్‌వెల్‌ సైతం తన జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు (292 పరుగుల లక్ష్యఛేదనలో 91/7 స్కోర్‌ వద్ద) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. 

అయితే ఈ రెండు ఇన్నింగ్స్‌ల మధ్య వ్యత్యాసం ఏంటంటే.. కపిల్‌ ఇన్నింగ్స్‌ తొలుత బ్యాటింగ్ చేస్తూ చేసినది కాగా, మాక్సీ ఛేదనలో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇక్కడ, అక్కడ ఆటగాళ్లు తమతమ జట్ల గెలుపుకు వంద శాతం దోహదపడ్డారు. ఇద్దరూ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక్కడ మ్యాక్సీ పోరాడితే పోయేది ఏమీ లేదని సక్సెస్‌ సాధించగా.. నాడు కపిల్‌ సైతం ఇదే ఫార్ములాను ఉపయోగించి ఫలితం రాబట్టాడు.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)