Breaking News

ప్రపంచకప్‌లో పెను సంచలనం.. జగజ్జేత ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌

Published on Sun, 10/15/2023 - 21:31

2023 వన్డే ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. జగజ్జేత ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ భారీ షాకిచ్చింది. న్యూఢిల్లీ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌.. ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్‌ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఛేదనలో ఆది నుంచి తడబడుతూ వచ్చిన ఇంగ్లండ్‌.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఆఫ్ఘన్‌ బౌలర్లకు దాసోహమైంది. 

ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (10-1-51-3) ఇంగ్లండ్‌ లైనప్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. మొహమ్మద్‌ నబీ (6-0-16-2), రషీద్‌ ఖాన్‌ (9.3-1-37-3), నవీన్‌ ఉల్‌ హాక్‌ (6-1-44-1), ఫజల్‌ హక్‌ ఫారూఖీ (7-0-50-1) తలో చేయి వేసి ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (66) మినహాయించి మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. బెయిర్‌స్టో 2, మలాన్‌ 32, రూట్‌ 11, బట్లర్‌ 9, లివింగ్‌స్టోన్‌ 10, సామ్‌ కర్రన్‌ 10, వోక్స్‌ 9, ఆదిల్‌ రషీద్‌ 20, మార్క్‌ వుడ్‌ 18 పరుగులు చేసి ఔటయ్యారు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. రహ్మానుల్లా గుర్బాజ్‌ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇక్రమ్‌ అలీఖిల్‌ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్‌ (28), రషీద్‌ ఖాన్‌ (23), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (28) రాణించడంతో 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ (4-0-41-0), మార్క్‌ వుడ్‌ (9-0-50-2), సామ్‌ కర్రన్‌ (4-0-46), రీస్‌ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్‌ రషీద్‌ (10-1-42-3), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (10-0-33-1), జో రూట్‌ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. 

వరల్డ్‌కప్‌లో రెండో విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్‌..
2015 ఎడిషన్‌తో వన్డే ప్రపంచకప్‌లోకి అరంగేట్రం చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఆ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడి ఒక్క స్కాట్లాండ్‌పై మాత్రమే విజయం సాధించింది. ప్రపంచకప్‌లో ఇదే ఆఫ్ఘనిస్తాన్‌ మొదటి, ఆఖరి విజయం. ఆతర్వాత ఈ జట్టు 2019 ఎడిషన్‌లో 9 మ్యాచ్‌లు ఆడినా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలువలేదు. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఆఫ్ఘన్లు.. ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం సాధించి, ప్రపంచకప్‌లో తమ రెండో విజయాన్ని నమోదు చేశారు. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)