Breaking News

వారిని ఆపలేకపోయాం, మా ఫీల్డింగ్‌ చండాలం, క్యాచ్‌లే కొంపముంచాయి: ఆఫ్ఘన్‌ కెప్టెన్‌

Published on Thu, 10/19/2023 - 08:11

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్‌ 18) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 149 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ను ఓడించి, సంచలనం సృష్టించిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. ఫలితంగా వారు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. మరోపక్క న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కలిసికట్టుగా మరో అద్భుత ప్రదర్శన చేసి, టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేశారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. విల్‌ యంగ్‌ (54), కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (68), గ్లెన్‌ ఫిలిప్స్‌ (71) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఆఫ్ఘన్‌ బౌలర్లలో అజ్మతుల్లా, నవీన్‌ ఉల్‌ హాక్‌ తలో 2 వికెట్లు.. ముజీబ్‌, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. లోకీ ఫెర్గూసన్‌ (7-1-19-3), మిచెల్‌ సాంట్నర్‌ (7.4-0-39-3), ట్రెంట్‌ బౌల్ట్‌ (7-1-18-2), మ్యాట్‌ హెన్రీ (5-2-16-1), రచిన్‌ రవీంద్ర (5-0-34-1) ధాటికి 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మాత్‌ షా (36), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (27) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

కివీస్‌ చేతిలో ఓటమిపై మ్యాచ్‌ అనంతరం ఆఫ్ఘన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహీది స్పందిస్తూ.. ముందుగా కివీస్‌కు శుభాకాంక్షలు. ఈ మ్యాచ్‌లో వారు చాలా బాగా ఆడారు. అన్ని విభాగాల్లో మాపై పైచేయి సాధించారు. మేము మాత్రం మా స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. మా ఫీల్డింగ్‌ చాలా చండాలంగా ఉంది. అంతర్జాతీయ  స్థాయిలో ఇలాంటి ఫీల్డింగ్‌తో రాణించడం చాలా కష్టం. మా ఆటగాళ్లు వదిలేసిన క్యాచ్‌లే మా కొంపముంచాయి. ఆ కారణంగానే న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది.

ఆఖరి 6 ఓవర్లలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఒకవేళ ఆ క్యాచ్‌లు పట్టినట్లయితే ప్రత్యర్ధి ఇంత స్కోర్‌ చేసేది కాదు. టామ్‌, ఫిలిప్స్‌ను మేము నిలువరించలేకపోయాం. పిచ్ చాలా స్లోగా ఉండింది. మేము బాగా బౌలింగ్ చేసాము కానీ, ఫీల్డింగ్ మా కొంపముంచింది. మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ల్లో మా లోపాలను అధిగమించి విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)