చాలా బాధగా ఉంది.. ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాము: ఆఫ్ఘన్‌ కెప్టెన్‌

Published on Wed, 11/08/2023 - 10:01

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 3 వికెట్ల తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి 291 పరుగులు చేసిన ఆఫ్ఘన్లు ఓ దశలో ఆసీస్‌పై సంచలన విజయం సాధించేలా కనిపించారు. అయితే మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర ద్విశతకంతో (128 బంతుల్లో 201 నాటౌట్‌; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆఫ్ఘన్ల ఆశలపై  నీళ్లు చల్లాడు. మ్యాక్సీ ఆఫ్ఘన్లకు విజయాన్ని దూరం చేయడంతో పాటు వారి సెమీస్‌ అవకాశాలను సైతం సంక్లిష్టం చేశాడు. ఊహించని ఈ ఓటమితో ఆఫ్ఘన్లు ఖంగుతిన్నారు. వారి బాధ వర్ణణాతీతంగా ఉంది. ఇది వారి కెప్టెన్‌ మాటల్లో స్పష్టంగా తెలిసింది. 

మ్యాచ్‌ అనంతరం ఆఫ్ఘన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహీది మాట్లాడుతూ.. చాలా బాధగా ఉంది. మేం ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాము. ఓ దశలో గెలుస్తామని పూర్తి విశ్వాసంగా ఉన్నాము. క్రికెట్ తమాషా ఆట. క్షణాల వ్యవధిలో ఫలితం తారుమారవుతుంది. మ్యాక్స్‌వెల్‌ మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. మా బౌలర్లు అద్భుతంగా ప్రారంభించారు. అయితే డ్రాప్‌ క్యాచ్‌లు మా కొంపముంచాయి. పలు మార్లు లైఫ్‌లు లభించిన అనంతరం మ్యాక్స్‌వెల్‌ ఆగలేదు.

అతను ప్రతి రకమైన షాట్‌ ఆడాడు. క్రెడిట్ మొత్తం అతనికే. మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌ సాగిన తీరు వర్ణణాతీతం. మా బౌలర్లు తమ వంతు ప్రయత్నం చేసినా అతను మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. జారవిడిచిన క్యాచ్‌లకు తగిన మూల్యం చెల్లించుకున్నాం​. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ, జట్టు ప్రదర్శన పట్ల ఇప్పటికీ గర్వంగా ఉంది. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇదంతా ఆటలో భాగం. దక్షిణాఫ్రికాతో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో పుంజుకుంటాం.

ఇబ్రహీం జద్రాన్ అత్యద్భుం. అతన్ని చూస్తే  గర్వంగా ఉంది. వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన మొదటి ఆఫ్ఘన్‌గా రికార్డుల్లోకెక్కినందుకు అతను కూడా గర్వపడాలి అని అన్నాడు. 

కాగా, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఇబ్రహీం జద్రాన్‌ (143 బంతుల్లో 129 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో మెరవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఆసీస్‌ ఓ దశలో (91/7) ఓటమి కొరల్లో చిక్కుకుంది. అయితే మ్యాక్స్‌వెల్‌ అజేయ డబుల్‌ సెంచరీతో వారిని విజయతీరాలకు చేర్చాడు.

ఆసీస్‌ 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్‌ సెమీస్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. సెమీస్‌లో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ (బంగ్లాదేశ్‌తో) ఆడాల్సి ఉంది.

చదవండి: గొప్ప విజయం.. మ్యాక్సీని ఎలా పొగడాలో తెలియడం లేదు: కమిన్స్‌

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)